పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ మరోసారి బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ కేటగిరిలో వెంకటేష్ అయ్యర్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చినా రెండో వన్డేలో కూడా అతడికే తుది జట్టులో స్థానం కల్పించింది. తొలి వన్డేలో ఓడిన భారత్ రెండో వన్డేలో కూడా ఓడితే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేయాల్సి ఉంది.
జట్ల వివరాలు
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, జె.మలాన్, మర్‌క్రమ్, డస్సెన్, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో, మగాలా, కేశవ్ మహారాజ్, షాంసీ, ఎంగిడి