ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొత్తగా అడుగుపెట్టబోతున్న లక్నో ఫ్రాంచైజీకి అధికారులు నామకరణం చేశారు. ఇకపై లక్నో ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ అని పిలవనున్నారు. తమ ఫ్రాంచైజీకి పేరును సూచించాలంటూ లక్నో జట్టు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించింది. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గోయెంకా తమ జట్టు పేరును అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు టీమ్ లోగోను కూడా ఆవిష్కరించారు. అయతే ఈ పేరు గతంలో ఆడిన పూణె జట్టుకు ఉండేది. అప్పట్లో సంజీవ్ గోయెంకాకే చెందిన ఆ జట్టుకు రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ అని పేరు ఉండేది. ఇప్పుడు అదే పేరును లక్నో జట్టుకు ఫిక్స్ చేశారు.
Read Also: ఐసీసీ అవార్డులను కొల్లగొట్టిన పాక్ క్రికెటర్లు
సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీఎస్జీ సంస్థ రూ.7090 కోట్లతో లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ ముగ్గురు కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినీస్, రవి బిష్ణోయ్‌లను జట్టులోకి తీసుకోగా… కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ఇందుకోసం కేఎల్ రాహుల్‌కు రికార్డు స్థాయిలో రూ.17 కోట్లను లక్నో ఫ్రాంఛైజీ చెల్లించనుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినీస్‌కు రూ.9.2 కోట్లు, భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ.4 కోట్లను చెల్లించనుంది. మిగతా ఆటగాళ్లను వచ్చేనెలలో జరిగే మెగా వేలంలో కొనుగోలు చేయనుంది.