IPL 2025 Suspended : దేశంలో నెలకొన్న భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరవధికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ , పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఆటగాళ్లు ,…
ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది ఆర్సీబీనే. గతంలో విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తుంది. 17 ఏళ్లుగా టైటిల్ కరువులో ఉన్న ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాప్2 లో కొనసాగుతుంది. అయితే కోహ్లీ ఢిల్లీ వాసి అయినప్పటికీ ఢిల్లీ తరఫున ఆడకుండా బెంగుళూరు తరఫున ఎందుకు ఆడుతున్నాడన్న డౌట్ రావొచ్చు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు అంటే 2008కి ముందు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ వేసింది. బరిలోకి దిగిన పంజాబ్ జట్టును 6 వికెట్లకు 157 పరుగుల స్కోరు చేసింది. ఆర్సీబీ7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. పడిక్కల్(61) దించికొట్టాడు. కింగ్ కోహ్లీ(71) వీర బాదుడు బాదాడు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యం అందించారు. 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి…
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్‌షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
నేడు బెంగళూరు, ఆర్సీబీ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఈసారి తన సొంతమైదానం ముల్లాన్‌పుర్‌లో ఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. పరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు లక్ష్యం 158 పరుగులు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఐపీఎల్ 2025 మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎస్ఆర్హెచ్ లేదా కమిన్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పాట్ భార్య బెక్కీ కమ్మిన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఊహాగానాలుగా మొదలయ్యాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు పోటీ పడుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ టీంలు, ఐదు సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెతికలపడ్డాయి. మన హోం జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పరాజయాలను ఎదుర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకువెలుతున్నాయి.
నేడు ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ లక్ష్యం 189 పరుగులు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్(49) అత్యధిక పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్(38), అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-28లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు శాంసన్ ఉన్నాడు.