Chennai Super Kings: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఆయా ఫ్రాంఛైజీలు ప్లేయర్స్ ట్రేడ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్ టీంను వీడారు. వీరు ఇరువురు రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి చేరారు. అలాగే, ఆర్ఆర్ కు చెందిన సంజూ శాంసన్‌ను సీఎస్కే దక్కించుకుంది. ఈ విషయం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచింది. అయితే, ఈ రోజు (నవంబర్ 15న) అధికారికంగా ఐపీఎల్ ప్రకటన జారీ చేసింది. అయితే, జడ్డూ భాయ్ చెన్నై జట్టును వీడటంపై ఆ ఫ్రాంఛైజీ సీఈఓ కాశీవిశ్వనాథన్ మాట్లాడుతూ.. జట్టుకు టాప్ ఆర్డర్ ఇండియన్ బ్యాటర్ కావాలని యాజమాన్యం కోరుకుంది. కానీ, ఆక్షన్‌లో ఎక్కువమంది మన బ్యాటర్లు లేరు.. దీంతో ట్రేడ్ ద్వారా సొంతం చేసుకోవాలని అనుకున్నాం.. కొన్ని ఏళ్లుగా తమ జట్టు విజయాల్లో కీ రోల్ పోషిస్తూ వచ్చిన రవీంద్రను వదులుకోవడం నిజంగా కఠినమైన నిర్ణయం అని కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
Read Also: IBomma Ravi Arrested : కీలక సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. కోర్టుకు తరలింపు
అయితే, తప్పనిసరి పరిస్థితుల్లోనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ జడ్డూ భాయ్ ని వదిలి పెట్టుందుకు నిర్ణయం తీసుకుంది అని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇక, దీనికి ముందు తన ఆలోచనను ప్లేయరక్స్ తో పంచుకుంది.. పర్మిషన్ తోనే యాజమాన్యం ఈ ట్రేడ్‌కు వెళ్లింది అన్నారు. అలాగే, జడేజా కూడా సానుకూలంగానే రియాక్ట్ అయ్యారు.. సామ్ కరన్‌ను వదిలి పెట్టుకోవడం కూడా కఠిన నిర్ణయమే.. వీరు తమ కెరీర్ ది బెస్ట్ ఇచ్చారని తెలిపారు. చెన్నై జట్టును బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.. మాకు ఇండియన్ బ్యాటర్‌ను పొందడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకలేదు. సంజూ.. ఐపీఎల్‌లో చాలా అనుభవమున్న ప్లేయర్..అతడు దాదాపు 4,500కు పైగా రన్స్ చేశాడు. అలాగే, రాజస్థాన్ రాయల్స్‌కు సారథిగా కొనసాగుతున్నాడని కాశీ విశ్వనాథన్ వివరించారు.
Read Also: Betting Apps Case : సీఐడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రాణా..
ఇక, అభిమానుల బాధను మేము అర్థం చేసుకోగలం, కానీ తప్పలేదని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నారు. ఈ నిర్ణయంతో సీఎస్కే అభిమానులు నిరాశకు గురయ్యారు. వారి నుంచి మాకు చాలా మెసేజ్‌లు కూడా వచ్చాయి.. కానీ మార్పు తప్పనిసరి అయింది. రాబోయే కాలంలో చెన్నై ఇప్పటిలాగే మెరుగైన ప్రదర్శన, నిలకడగా రాణిస్తుందని పేర్కొన్నాడు. అయితే, జడ్డూ భాయ్ 12 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. 2022 సీజన్‌లో పలు మ్యాచ్ లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. జడేజా ఇప్పటి వరకు 186 మ్యాచుల్లో (సీఎస్కే తరఫున) 143 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 2,198 రన్స్ చేశాడు. ఈ ఆల్‌రౌండర్ ఐపీఎల్ లీగ్ ఫీజ్‌ను రూ.18 కోట్ల నుంచి రూ.14 కోట్లకు తగ్గించి ట్రేడ్ చేసుకుంది రాజస్థాన్. చెన్నై సూపర్ కింగ్స్ సంజూ శాంసన్ లీగ్ ఫీజులో ఎలాంటి మార్పు చేయకుండా రూ.18 కోట్లకు దక్కించుకుంది.
“Decision taken on mutual agreement with Jadeja and Curran.” – CSK MD Kasi Viswanathan speaks on the trade. #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/8HAZrdIBJP
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2025