Asia Cup Rising Stars: దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో గ్రూప్–B లో భాగంగా భారత జట్టు ఒమాన్‌పై విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఒమాన్ నిర్ణయించిన 136 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సాధించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో చక్కటి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన హర్ష్ దుబే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఒమాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. వారి ఇన్నింగ్స్ లో కెప్టెన్ హమ్మాద్ మిర్జా 16 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత వసీమ్ అలీ 45 బంతుల్లో 54 పరుగులు చేసి ఒమాన్ స్కోరును ఓ మోస్తరుగా నిలిపారు. భారత బౌలర్లలో సుయాష్ శర్మ 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. గుర్జప్‌నీత్ సింగ్ కూడా 2 వికెట్లు తీసి ఒమాన్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు.
Maoist Hidma: లొంగిపోయే ప్రయత్నం.. జర్నలిస్ట్‌కు లేఖ రాసిన హిడ్మా.. అంతలోనే..
ఇక 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ప్రారంభంలో రెండు వికెట్లు త్వరగా కోల్పోయినా.. ఆ తర్వాత హర్ష్ దుబే (44 బంతుల్లో 53*) అద్భుతంగా ఆడాడు. అతనికి నమన ధీర్ (30) మంచి సహకారం అందింది. చివర్లో నేహల్ వాధేరా 23 పరుగులు చేసి జట్టు విజయం సులభం చేశాడు. దీనితో చివరిగా 18 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఒమాన్ బౌలర్లలో జయ ఓడద్రా, షఫీఖ్ జాన్, సమయ్ శ్రీవాస్తవ, ఆర్యన్ బిష్ట్ తలో ఒక వికెట్ తీశారు. అయితే భారత బ్యాట్స్‌మెన్‌ల దూకుడును అప్పలేకపోయారు. ఇక భారత్ గ్రూప్ B లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో 4 పాయింట్లతో భారత ‘A’ జట్టు సెమీస్ స్థానాన్ని కన్ఫామ్ చేసుకుంది.
Bhagyashri Borse : కచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటా..
