ఐపీఎల్ 2025లో భాగంగా.. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ చెన్నై చెపాక్ కోటను బద్దలు కొట్టింది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఈ విజయం అనంతరం.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన సహచరులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు.
రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో బెంగళూరు జట్టు 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సీఎస్కేని వారి సొంత మైదానంలో ఓడించింది. చెన్నై కంచు కోటను కూడా బద్దలు కొట్టగలిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అర్ధ…
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో.. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మార్చి 24న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో ఆడుతుండగా 36 ఏళ్ల ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను ఓడించింది. అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఈ మ్యాచ్ అనంతరం అశుతోష్ తన ఇన్నింగ్స్‌ను గురువు శిఖర్ ధావన్‌కు అంకితం చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై తొలి మ్యాచ్‌లో విజయ కేతనం ఎగుర వేసింది. గత 12 సంవత్సరాలుగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగించింది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్లో మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ సేన 155 పరుగులు సాధించింది. సీఎస్కే విజయానికి 156 పరుగులు అవసరం. తిలక్ వర్మ 31 పరుగులు చేయగా.. కెప్టెన్…
ఐపీఎల్ (IPL) సీజన్ మొదలైతే చాలు, పాత రికార్డులకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ప్రతి సీజన్లో ఉన్న రికార్డులు బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి. కానీ, కొన్ని అరుదైన ఫీట్లను అందుకోవడం మాత్రం అంత తేలిక కాదు. తాజా డకౌట్ తో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్లు అయిన గ్లెన్ మాక్స్ వెల్ సరసన చేరాడు. గ్లెన్ మాక్స్ వెల్ కూడా ఐపీఎల్ ఇప్పటివరకు 18 సార్లు డకౌట్ అయ్యాడు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ టీం అద్భుత ప్రదర్శన కనబరిచింది. కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్లో అత్యధిక స్కోరు కూడా…