ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్ జైస్వాల్ ఇంగ్లాండ్ గడ్డపై 144 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఫైనల్స్ ఏ కలిసి రావడం లేదు. ఐపీఎల్ ఫైనల్ లో ఆర్సీబీతో జరిగిన టైటిల్ మ్యాచ్ లో అయ్యర్ సారధ్యం వహించిన పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. పదిరోజుల తర్వాత అయ్యర్ సారధ్యం వహించిన సోబో ముంబయి ఫాల్కన్స్ జట్టు ఫైనల్లో సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ పది రోజుల వ్యవధిలో అయ్యర్ రెండు సార్లు ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ ఫైనల్…
పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్ళైన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ , షాహీన్ అఫ్రిదిలను T20 జట్టు నుంచి తొలగిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ త్వరలో బంగ్లాదేశ్ ,వెస్టిండీస్‌తో T20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు సీనియర్లను పక్కనపెట్టింది. రిజ్వాన్ నేతృత్వంలో పాకిస్తాన్ దక్షిణాఫ్రికాలో జరిగిన T20 అంతర్జాతీయ సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమి పాలైంది. ఆ జట్టులో బాబర్ ఆజం కూడా ఉన్నాడు. దీంతర్వాత బాబర్, రిజ్వాన్…
Nicholas Pooran: అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు నికోలస్ పూరన్ గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు. ఈ నిర్ణయం చాలా కష్టమైనది.. అయినప్పటికీ చాలా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను అని అందులో పేర్కొన్నాడు.
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటివరకు కోహ్లీ మొత్తం 770 ఫోర్లు బాదాడు. దీంతో అతను ఫోర్ల పరంగా టాప్ స్థానంలోకి ఎగబాకాడు. గత కొన్ని సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న కోహ్లీ, ఈ రికార్డుతో తన క్లాస్‌ను మరోసారి…
IPL 2025 Final: గత 2 నెలలుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న 2025 ఐపీఎల్ సీజన్ ఫైనల్ కు సిద్ధమైంది. ఈసారి ఓ కొత్త ఛాంపియన్ రాబోతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జూన్ 3న అహ్మదాబాద్ లో ఫైనల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసాయి. ఇకపోతే రేపు జరగబోయే ఫైనల్ ముందు ఇరు జట్ల కెప్టెన్స్ ఐపీఎల్ ట్రోఫీతో…
ఈరోజు ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం స్టేడియంలో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఈ సారి టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఈ సీనియర్ ఆటగాళ్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో సెలక్టర్లకు జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కెప్టెన్‌పై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్లు లేని జట్టులో మరో ఇద్దరు సీనియర్లు జట్టుకు దూరం కానున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు మహ్మద్ షమీ దూరం అయ్యే అవకాశముంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఐసీసీ... మ్యాచ్ అఫిషియల్స్ ను ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లను ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా నియమించారు.
IPL 2025: టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. విరుష్క దంపతులను బృందావనం నిర్వాహకులు ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కోహ్లీ, అనుష్క గురువు కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రేమానంద్ జీ ఆధ్యాత్మిక ప్రవచనాలను విన్నారు. నిజానికి కోహ్లీ కెరీర్ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న సమయాల్లో ఎక్కువగా ప్రేమానంద్ మహారాజ్‌ను కలుస్తారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ…