SA vs IND: ఒక్కరోజే 16 వికెట్లు నేలమట్టం.. ముగిసిన రెండో రోజు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA vs IND: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కొనసాగుతున్న భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ రెండో రోజు అసలు టెస్ట్ క్రికెట్ ఎలాంటి అనూహ్య మలుపులు తెస్తుందో అచ్చం అలాగే కొనసాగింది. ఒక్క రోజులోనే 16 వికెట్లు పడడంతో మ్యాచ్ నిరాశాజనకంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ తర్వాత భారత్ 189 పరుగులకే కుప్పకూలిపోవడం ఈ రెండూ బౌలర్ ఫ్రెండ్లీ పిచ్ పరిస్థితులను స్పష్టం చేశాయి.
SSMB29 Updates: మాట తప్పని జక్కన్న.. 15 ఏళ్ల క్రితం ఫిక్స్ అయిన మహేష్ బాబు కాంబో
Also Read
- Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
- Geetu Mohandas: "నేను రాసిందొకటి.. తీసిందొకటి".. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు ఆడిన దక్షిణాఫ్రికా మరోసారి భారత బౌలర్ల స్పిన్, పేస్ కాంబినేషన్‌కు బలైంది. రెండో రోజు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 93 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. క రెండో రోజు ఆట ముగిసే సమయానికి 63 పరుగుల ఆధిక్యం ఉన్నా చేతిలో ఇంకా ముగ్గురు బ్యాట్స్మెన్స్ మాత్రమే ఉండటంతో మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్‌లోనే ఫలితం దిశగా వెళ్లనుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో రికెల్టన్, మార్క్రమ్ మంచి ఆరంభం ఇచ్చినా, మధ్య ఓవర్లలో బుమ్రా తన అద్భుతమైన స్పెల్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. 14 ఓవర్లలో 5 మెడెన్స్‌తో 27 పరుగులకే ఐదు వికెట్లు తీశాడు. సిరాజ్, కుల్దీప్ కూడా కలిసివచ్చి మొత్తం సౌతాఫ్రికా లైనప్‌ను 159కే ముగించారు. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, జడేజా వంటి కీలక బ్యాట్స్‌మెన్ చిన్న ఇన్నింగ్స్‌లతో మాత్రమే ప్రతిఘటన అందించగలిగారు. సైమన్ హర్మర్ (4/30) మరియు జాన్సెన్ (3/35) బౌలింగ్‌లో అద్భుతం చేసి భారత్‌కి పెద్ద లీడ్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. శుభ్‌మన్ గిల్ గాయంతో రిటైర్డ్ హర్ట్ కావడం టీమ్‌కు పెద్ద దెబ్బగా మారింది.
రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ మరింత కష్టాలను ఎదుర్కొంది. జడేజా తన స్పిన్ మాయతో 4 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసి గట్టి దెబ్బ కొట్టాడు. దీనితో దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ పూర్తిగా తడబడింది. కెప్టెన్ బవుమా మాత్రం ఒంటరిగా పోరాడుతూ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
తాజావార్తలు
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?