Australia vs England: పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెస్ 2025 తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ విలవిలలాడింది. ఈ దెబ్బకు కేవలం 32.5 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్క్ ఒక్కడే 7 వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ చేత్తులేత్తిసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే వికెట్ తీయడం నుండి ఇన్నింగ్స్ చివరివరకు తన పదుననిన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్‌పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.50,000..!
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే స్టార్క్ తన వికెట్ల హంటింగ్ ప్రారంభించాడు. జాక్ క్రాలీని పరుగుల ఖాతా తెరవనీయకుండానే పెవిలియన్‌కు పంపి మొదటి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత బెన్ డకెట్ (21) వేగంగా రన్స్ చేసినప్పటికీ.. అతను కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఆపై వరుసగా జో రూట్ (0), ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (6), గస్ అట్కిన్సన్ (1), మార్క్ వుడ్ (0) వికెట్లను పడగొట్టి స్టార్క్ ఇంగ్లాండ్‌కి ఊపిరి కూడా పీల్చనీయకుండా చేశాడు. మొత్తం మీద ఆయన 12.5 ఓవర్లలలో 4 మెయిడెన్స్, 58 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు.
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్‌పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.50,000..!
ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఒల్లి పోప్ (46), హ్యారీ బ్రూక్ (52) మాత్రమే కొంత పోరాడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ చివరిలో జేమీ స్మిత్ (33) కొంత ఫైట్ ఇచ్చినా, స్టార్క్ తిరిగి వచ్చి చివరి రెండు వికెట్లు చిట్టచివరికి ముగించాడు. కీలమైన సమయాల్లో డాగెట్, గ్రీన్ ఇచ్చిన బ్రేక్‌త్రూలతో ఇంగ్లాండ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. మిచెల్ స్టార్క్ 7 వికెట్లతో పాటు.. డాగెట్ 2 వికెట్లు, గ్రీన్ ఒక వికెట్ తీశారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం ముగ్గురు డక్ అవుట్ అయ్యారు.