WPL 2026 Auction: WPL 2026 మెగా వేలం న్యూఢిల్లీలో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ వేలానికి మరోసారి మల్లికా సాగర్ యాక్షనీర్‌గా వ్యవహరించారు. ఇక ఈ వేలంలో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు 73 ఖాళీల కోసం పోటీపడగా.. 277 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ వేలంలో తెలుగమ్మాయి శ్రీ చరణి జాక్ పాట్ కొట్టిందని భావించవచ్చు. కేవలం రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి దిగిన ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య భారీ బిడ్డింగ్ పోటీ సాగింది. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.30 కోట్ల భారీ మొత్తానికి ఆమెను దక్కించుకుంది. బేస్ ప్రైస్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధర రావడం ప్రత్యేక హైలైట్‌గా మారింది.
స్ప్రౌట్స్ తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే !
భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఈ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ చేస్తుండగా.. యూపీ వారియర్స్ RTM కార్డును ఉపయోగించి బిడ్‌ను రూ. 3.20 కోట్లకు పెంచి ఆమెను సొంతం చేసుకుంది. దీనితో ఆమె కూడా భారీ ధర పలికింది. ఇక విదేశీ స్టార్లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. ఇందులో భాగంగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్లకు తీసుకోగా, అదే దేశానికి చెందిన సోఫీ డివైన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్‌ను యూపీ వారియర్స్ రూ. 1.90 కోట్లకు తీసుకోగా, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ రూ. 1.20 కోట్లతో అదే జట్టులో చేరింది. దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్ట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.10 కోట్లకు దక్కించుకుంది.
Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ‘దిత్వా’గా నామకరణం.. ఏపీకి భారీ వర్ష సూచన..
ఇతర భారతీయ ఆటగాళ్లలో రేణుకా సింగ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 60 లక్షలకు తీసుకోగా, సోఫీ ఎకిల్‌స్టోన్‌ను యూపీ వారియర్స్ RTM ద్వారా రూ. 85 లక్షలకు తిరిగి దక్కించుకుంది. భారతీ ఫుల్మాలి, కిరణ్ నోవ్‌గిరేలను కూడా వారి జట్లు RTM ద్వారా కొనుగోలు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇంకా వేలం కొనసాగుతుంది. మరిన్ని తాజా వారతలా కోసం NTV తెలుగు స్పోర్ట్స్ పేజీని ఫాలో అవ్వండి.
An exciting start to the #TATAWPL Mega Auction 👏
🎥 A thrilling bidding battle sees Sophie Devine becoming the first buy of the day for INR 2 Crore🔨#TATAWPLAuction | @Giant_Cricket pic.twitter.com/csu4VEXIbd
— Women's Premier League (WPL) (@wplt20) November 27, 2025