గ్లోబల్ మార్కెట్ బలహీన ధోరణి కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి 72000 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 21650 దిగువన ప్రారంభం కాగా... ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.
అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానం దక్షిణ కొరియాలో కూలిపోయింది. శిక్షణ సమయంలో విమానం ప్రమాదానికి గురైందని యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం.. గన్సన్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. “సియోల్‌కు దక్షిణంగా 178…
గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్న ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్.. నిర్దేశిత స్థలానికి కాకుండా ఓ ప్రాజెక్టులోకి తీసుకెళ్లింది. అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలోకి డీసీఎం వ్యాన్ వెళ్లింది. దీంతో.. విషయం తెలుసుకున్న జాలు బాయి తండావాసులు భారీగా తరలివచ్చారు. అనంతరం జేసీబీ సహాయంతో డీసీఎం వ్యానును బయటకు తీశారు.
యూకేలో చెక్క దిమ్మెలతో తయారుచేసిన అత్యంత ఎత్తైన టవర్ ను కూల్చివేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
హాలీవుడ్ డైరెక్టర్ పాల్ హగ్గిస్ పేరు ఫిలిమ్ బఫ్స్ కు సుపరిచితమే! ఆయన రచనతో తెరకెక్కిన ‘మిలియన్ డాలర్ బేబీ’, ‘క్రాష్’ చిత్రాలు ఆస్కార్ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. ‘క్రాష్’ ద్వారా ఆయనకు నిర్మాతగా, రచయితగా కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. 69 ఏళ్ళ హగ్గిస్ ను ఇప్పటికీ కొందరు రొమాంటిక్ అంటూ కీర్తిస్తుంటారు. అందులో నిజానిజాలు ఏమో కానీ, ఓ రేప్ కేసులో హగ్గిస్ ను ఇటలీ పోలీసులు ఆదివారం (జూన్ 19న) అదుపులోకి తీసుకున్నారు.…
విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణాలు ఎప్పుడూ ప్రమాదమే. ఎంత అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోటే విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేస్తుంటారు. వీవీఐపీలు ప్రయాణం సమయంలో అధికారులు మరింత కేర్ తీసుకుంటారు. ప్రయాణం చేసే మార్గంలో తనీఖీలు, ల్యాండింగ్ వంటి వాటిని ట్రయల్స్ నిర్వహిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. దేశంలో అనేక మంది ప్రముఖులు…
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రం ప్రస్తుతం సేఫ్ గా ఉన్నట్లు సమాచారం. ఖైరతాబాద్ వైపు నుంచి తెలుగు తల్లి ప్లైవర్ వైపు వెళ్తుంటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్ స్పీడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఢీ-వైడర్ ను ఢీ కొని రోడ్డుపై కారు బోల్తా పడింది. అదృష్టవశాత్తు తృటిలో…