ఒకప్పుడు తెలియన ప్రదేశానికి వెళ్లాలంటే.. అక్కడి వివరాలు కనుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ అవసరం లేదు. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్ అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుంచి.. ఫోన్లో గూగుల్ మ్యాప్ పెట్టుకోవడం వెళ్లడమే. కరెక్ట్గా గూగుల్ మ్యాప్ మనం ఎంచుకున్న ప్రదేశానికి తీసుకుపోతుంది. కానీ.. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ కొంప ముంచుతుంది. అనుకున్న ప్రదేశానికి కాకుండా.. మరొక ప్రదేశానికి తీసుకెళ్లి ప్రమాదానికి గురి చేస్తుంది.
Read Also: Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంలో పూజారిగా యూపీ విద్యార్థి..ఎవరీ మోహిత్ పాండే..?
తాజాగా అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్న ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్.. నిర్దేశిత స్థలానికి కాకుండా ఓ ప్రాజెక్టులోకి తీసుకెళ్లింది. అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలోకి డీసీఎం వ్యాన్ వెళ్లింది. దీంతో.. విషయం తెలుసుకున్న జాలు బాయి తండావాసులు భారీగా తరలివచ్చారు. అనంతరం జేసీబీ సహాయంతో డీసీఎం వ్యానును బయటకు తీశారు.
Read Also: Nizamabad: మహిళలకు టికెట్ కొట్టిన కండక్టర్.. తర్వాత ఏమైందంటే..!