అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానం దక్షిణ కొరియాలో కూలిపోయింది. శిక్షణ సమయంలో విమానం ప్రమాదానికి గురైందని యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం.. గన్సన్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. “సియోల్‌కు దక్షిణంగా 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న గున్సాన్‌లోని విమానాశ్రయం నుండి బయలుదేరిన తర్వాత జెట్ నీటిలో కూలిపోయింది” అని యెల్లో సముద్రపు జలాలను ప్రస్తావిస్తూ ఏజెన్సీ తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే పైలట్ జెట్ నుండి బయటపడ్డాడని, గాయాలతో ఉన్నాడని యోన్‌హాప్ నివేదించింది.
Read Also: Article 370: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు నిర్ణయంపై బీజేపీ నేతలు స్పందన ఇదే..!
ఇలాంటి ప్రమాదమే.. మే నెలలో శిక్షణ సమయంలో జరిగింది. కాగా.. అమెరికా F-16 జెట్ కూలిన ఘటనపై దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంతేకాకుండా.. దక్షిణాన ఉన్న అమెరికా దళాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ ఫోర్సెస్ కొరియా కూడా ఇంకా స్పందించలేదు. ఈ ఏడాది మే నెలలో సియోల్‌కు దక్షిణంగా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో సాధారణ శిక్షణా వ్యాయామంలో అమెరికన్ F-16 జెట్ కూలిపోవడం గమనార్హం. ఈ సమయంలో కూడా పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.
Read Also: Uttam Kumar Reddy: నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి..