హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రం ప్రస్తుతం సేఫ్ గా ఉన్నట్లు సమాచారం. ఖైరతాబాద్ వైపు నుంచి తెలుగు తల్లి ప్లైవర్ వైపు వెళ్తుంటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్ స్పీడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఢీ-వైడర్ ను ఢీ కొని రోడ్డుపై కారు బోల్తా పడింది. అదృష్టవశాత్తు తృటిలో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు..అక్కడి నుంచి కారును తొలగించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..