విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణాలు ఎప్పుడూ ప్రమాదమే. ఎంత అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోటే విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేస్తుంటారు. వీవీఐపీలు ప్రయాణం సమయంలో అధికారులు మరింత కేర్ తీసుకుంటారు. ప్రయాణం చేసే మార్గంలో తనీఖీలు, ల్యాండింగ్ వంటి వాటిని ట్రయల్స్ నిర్వహిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. దేశంలో అనేక మంది ప్రముఖులు హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తూ మృతిచెందారు.
Read: వీడెవడండీ బాబు! వ్యాక్సిన్ వేస్తామంటే.. చెట్టెక్కాడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత అప్పటి లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండూ, హరియానా మంత్రి ఓపీ జిందాల్, తెలుగు సినీ నటీ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. తాజాగా త్రివిధ దళాదిపతి బిపిన్ రావత్, ఆయన భార్య, 11 మంది ఆర్మీ అధికారులు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.