రాష్ట్రంలో ప్రస్తుతం లోగో లొల్లి మొదలైంది. ఆవిర్భావ దినోత్సవం దగ్గర పడుతుండటంతో ఈ లోగోపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ పేరును పూర్తిగా చెరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో విపక్షాలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య ఇంటికి వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం వివాదం కావడంతో చుక్కా రామయ్యను కలిసి దానిపై చర్చించే అవకాశం ఉంది. సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు 45 మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సమావేశం తర్వాత రామయ్య ఇంటికి వెళ్లనున్నారు. అఖిలపక్షం నేపథ్యంలో ఇప్పటికే వివిధ పార్టీల నేతలు, జేఏసీ నేతలు, ఉద్యమకారులు సచివాలయానికి చేరుకున్నారు.
READ MORE: T20 World Cup 2024: టీమిండియా మ్యాచ్ పూర్తి షెడ్యూల్ ఇలా.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చంటే..
కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రతిపక్ష పార్టీలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. విపక్షాలు సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జానారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర ముఖ్య నాయకులు. సమావేశం కి హాజరైన సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కొత్త రాష్ట్ర చిహ్నం, గీతం గురించి వారితో చర్చించారు.