నల్లగొండ జిల్లా చండూరులో వామపక్షాల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హజరయ్యారు. అయితే.. ఈ సందర్భంగా… సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ మతోన్మాద రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని, 8 సంవత్సరాలుగా మోడీ సర్కార్ దేశానికి ఏం చేసిందో చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ మౌలిక హక్కులను బీజేపీ సర్కార్ నాశనం చేస్తుందని, ప్రజల మధ్య విద్వేషాలను నింపుతున్నారని, రాష్ట్ర లాక్కులను కాలరాస్తున్నారని ఆయన అన్నారు.
ఆలస్యంగా నైనా కేసీఆర్ బీజేపీపై పోరాటం చేస్తున్నందుకు ధన్యవాదాలు అని ఆయన అన్నారు. 22 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి మూడు సంవత్సరాలుగా బీజేపీతో టచ్ లో ఉన్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీతో పోట్లాడుతుంది కాబట్టి టీఆర్ఎస్ తో జత కట్టామని, కమ్యూనిస్టు నేతల కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అనిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు.