యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
తమ్మినేని వీరభద్ర మాట్లాడుతూ… మునుగోడు నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రంలో సీపీఎం పార్టీ మండల సమీక్ష సమావేశాలు నిర్వహించామని, టీఆర్ఎస్ పార్టీకి 30 వేల నుండి 40 వేల మధ్యలో స్పష్టమైన మెజార్టీ రాబోతుందన్నారు. రోజురోజుకీ టీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని, బీజేపీ గ్రాఫ్ డౌన్ అవుతుందన్నారు. కాంగ్రెస్ బలహీనపడుతుందని, మునుగోడులో బీజేపీ పార్టీ ఓడిపోతుందన్నారు. అంతేకాకుండా.. కమ్యూనిస్టుల మద్దతు ప్రజల్లో స్పష్టంగా విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది.. రాజగోపాల్ రెడ్డి తన స్వార్ధ కోసం రాజీనామా చేశాడు తప్ప, మునుగోడు అభివృద్ధి కోసం కాదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.. కాంగ్రెస్ పార్టీలో ఉంటు బీజేపీ పార్టీకి కోవర్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తున్నారు… బీజేపీ పార్టీ గందరగోళంగా ఉంది.. కాంగ్రెస్ బలహీనపడింది.. ఈ స్థితిలో టీఆర్ఎస్ పార్టీ లోకి చేరికలు పెరుగుతున్నాయి..
Also Read : Srilanka: శ్రీలంకలో ఇల్లు అమ్మి తమిళనాడుకు చేరుకున్న మహిళ.. ఎందుకో తెలుసా?
ఇంకో పది రోజుల్లో ఎన్నికలు వున్నాయ్. కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది టీఆర్ఎస్ బలపడిపోతుంది.. కేంద్రం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వలేదు, 8 లక్షల కోట్ల నల్లధనం తీసుకొచ్చి ఇంటింటికి పంచుతా అని చెప్పింది అయినా రూపాయి పంచలేదు.. రైతుల ఆదాయం పెంచుతాన్ని 2022 వరకు చెప్పాడు పెంచలేదు.. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా మత కల్లోలాలు పెరిగి రావణకష్టం లాగా దేశం భగ్గుమంటుంది.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు.. ముస్లిం మైనార్టీలను మొత్తం అణిచి వేయాలని చూస్తున్నారు… దుర్మార్గమైన ఈ బీజేపీ పార్టీని ఓడించడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.