CPI Ramakrishna: స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలర్పించిన ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు పేర్లు ప్రధాన ప్రస్తావించకపోవడం శోచనీయం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కాంగ్రెస్, సీపీఐదీ తిరుగులేని పాత్ర.. ఆర్ఎస్ఎస్ కు స్వాతంత్ర సంగ్రామంతో ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రశంసించడం సీపీఐ ఖండిస్తోంది.. దేశంలో పేదరికం తగ్గిందని ప్రధాని ప్రస్తావించారు.. అయితే, 50 కోట్ల మంది వరకు బియ్యం, గోధుమలు, ఉచిత రేషన్ కార్డుల ద్వారా ఎందుకు పంపిణీ చేస్తున్నారు అని ప్రశ్ని్ంచారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు ఎత్తు 47.72 అడుగుల మేర కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని డిమాండ్ చేశారు. 196 టీఎంసీల నీరు నిల్వ చేయాలి.. పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీ, ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి అని సీపీఐ రామకృష్ణ కోరారు.
Read Also: Cinema: హీరోలారా జాగ్రత్త.. తేడా వస్తే ఫాన్స్ కూడా వదలట్లేదు!!
ఇక, పోలవరం- బనకచర్ల ప్రాజెక్టులో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం చేసుకుంటే సీపీఐ చూస్తూ ఊరుకోదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తేల్చి చెప్పారు. పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు ఒక అంబక్ ప్రాజెక్ట్.. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించడం సీపీఐ స్వాగతిస్తోంది.. ఆర్టీసీలో 3 వేల బస్సులు కొనుగోలు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం సాఫీగా సాగేలా చేయాలి అని కోరారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి.. అలాగే, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాలలో నాణ్యమైన విద్య బోధించేలా చర్యలు తీసుకోవాలి సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.