ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా రెండు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 20,937 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…104 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 20,811 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1542079 కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 209156 గా ఉంది. కోవిడ్ బారినపడి మృతిచెందినవారి…
ఇవాళ సీఎం కేసీఆర్ వరంగల్ లో పర్యటించారు. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ సీఎంకు స్వాగతం పలుకగా అనంతరం కేసీఆర్ నేరుగా ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ ఉన్న కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోకి కోవిడ్ వార్డులలో పర్యటించి రోగులకు భరోసా…
ఏపీలో కోవిడ్ విలయం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని… ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్‌లు ఇవన్నీ కూడా నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలని అధికారులకు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు సిఎం జగన్. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని..ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులు, రెమ్‌డెసివర్ బ్లాక్ మార్కెట్ కఠిన…
ఇవాళ ఏపీ బడ్జెట్ సమావేశాలను జగన్ సర్కార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అసెంబ్లీలో..సిఎం జగన్ మాస్కు లేకుండా దర్శనం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిఎం జగన్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని.. ఇలాంటి సమయంలో సిఎం జగన్ మాస్క్ పెట్టుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? అంటూ సిఎం జగన్ కు చురకలు అంటించారు…
ఇండియాలో కరోనా విలయం కొనసాగుతోంది. దేశంలో ప్రతి రోజు 3 లక్షల కేసులు నమోదవు తున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,57,72,400 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా తీవ్రత తగ్గకముందే.. బ్లాక్ ఫంగస్ ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరో వ్యాధి ఇండియాను టెన్షన్ పెడుతోంది. తాజాగా పాట్నాలో వైట్ ఫంగస్ రోగులను వైద్యులు గుర్తించారు. ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రాణాంతకమని నిపుణులు భావిస్తున్నారు. పాట్నాకు చెందిన నలుగురు వ్యక్తులు…
తెలంగాణలో మరింత లాక్ డౌన్ అమలు అవుతోంది. లాక్‌డౌన్ అమలుపై సీపీ, ఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. లాక్‌డౌన్‌పై జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ రోజూ సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారన్న డీజీపీ… అందరూ ఒకేసారి రావడం వల్లే మార్కెట్లు, దుకాణాల వద్ద రద్దీ ఏర్పడుతోందని పేర్కొన్నారు. కమిషనర్ నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు రహదారులపై తిరగాలని డీజీపీ…
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,76,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,72,400 కి చేరింది. ఇందులో 2,23,55,440మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,29,878 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,874 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,87,122 కి చేరింది.…
మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీ 2021-22ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం ఉన్న 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 700 మెట్రిక్ టన్నులకు పెంచటమే ఉద్దేశ్యంగా ఈ పాలసీని ప్రారంభించారు. రాష్ట్రంలో 50 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పాలసీ రూపుదిద్దుకుంటోంది. ముందుకు వచ్చే ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. పెట్టుబడిలో 30 శాతం వరకు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అలాగే విద్యుత్ యూనిట్ కు…
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై మరోసారి కౌంటర్ వేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ సర్కార్ అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పోస్టులు భర్తీ చేస్తుందని పేర్కొన్న వైఎస్ షర్మిల.. సిఎం పదవిని కూడా కాంట్రాక్టు పద్దతిన చేపట్టాలని కెసిఆర్ కు చురకలు అంటించారు. “అన్నింటా కాంట్రాక్ట్ పోస్టులే అయితే .. ఇక సిఎం పదవి కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే ..” అని ముచ్చట చెప్పిన కెసిఆర్ సారుకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నాయి,…
ఏపీ ప్రభుత్వం ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా కష్ట కాలంలో బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాములా మారింది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాల అంచనాలను రూపొందిస్తోంది ఆర్ధిక శాఖ. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయిన ఏపీ…గత ఏడాది సుమారు 1.82 లక్షల…