యాస్ తుఫాన్ తీవ్రమవుతున్న నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వ, తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఏపి ప్రభుత్వం. ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు చర్యలకు సిద్దమైంది ప్రభుత్వం. యాస్ తుఫాన్ ప్రభావం ఏపి తో పాటు ఐదు రాష్ట్రాలపై వుంటుందని రాష్ట్ర ప్రభుత్వంను అలెర్ట్ చేసింది కేంద్రం. రూర్కెల, ఒడిషా నుండి 100 మిలియన్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను ఈనెల 24 లోగా సమీకరణ చేయనుంది. అంగుల్, కరీంనగర్, రూర్కెల నుండి కూడా రోడ్…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ కు కొత్త సమస్య వచ్చింది. తాజాగా ప్రకటించిన WHO అత్యవసర యూజ్ లిస్టింగ్ లో ఇంకా చోటు దక్కలేదు. అయితే WHO అనుమతి ఉన్న టీకాలు వేసుకున్న వారినే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని యూఎస్, యూకే దేశాలు పేర్కొన్నాయి. ఇందులో భాగంగానే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి అమెరికా, యూకే లోకి అనుమతించబోమని ఆ దేశాలు అంటున్నాయి. దీంతో భారత్ బయోటెక్…
వ్యాక్సిన్ తోనే శాశ్వత రక్షణ ఉంటుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు అన్ని రకాల చర్యలతో ఉత్పత్తిని వేగవంతం చేయాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ఈ రోజు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు సంబంధించిన ప్రతినిధులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుండి వస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ…
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే కోవిడ్–19ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిఎం జగన్. ఏపీలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించామని…అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత…
ఏపీ సర్కార్ పై జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. దేశంలో పంపిణీ జరిగిన ప్రతి 7 వెంటిలేటర్లలో ఒకటి ఏపీకి దక్కిందని..రాష్ట్రంలో చాలా చోట్ల వెంటిలేటర్లను సరిగా ఉపయోగించడం లేదని సమాచారం ఉందన్నారు. “కరోనా” కేసుల్లో ఏపీ 5వ స్థానంలో, మరణాల్లో 9వ స్థానంలో ఉందని.. ఇంత దారుణ పరిస్థితి ఏపీలో ఎందుకు నెలకొంది? అని ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందని ఫైర్ అయ్యారు. ఏపీలో సరైన సంఖ్యలో టెస్టులు…
ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా నాలుగు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 19,981 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…118 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 18,336 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060 కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,10,683 గా ఉంది. కోవిడ్ బారినపడి మృతి…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. కృష్ణపట్నం పేరు మారుమ్రోగుతోంది. కరోనాకు ఉచితంగా మందుపంపిణీ చేస్తుండడంతో.. ఇప్పుడు వేలాది మంది అటు పరుగులు తీస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు.. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. అయితే ఈ మందుపై ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య నిపుణులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఆయుర్వేద వైద్యుడు…
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో.. ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం…
ఏపీని బ్లాక్ ఫంగస్ కేసులు వణికిస్తున్నాయి. గత ఐదు రోజుల్లో 32 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పది బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు అయ్యాయి. కృష్ణా, తూ.గో, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించింది సర్కార్. ప్రకాశంలో ఆరు, గుంటూరులో 4, ప.గో, కడపలో మూడు, అనంత, కర్నూల్ జిల్లాల్లో రెండు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో బ్లాక్ ఫంగస్…