ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు.. క్రమంగా రెండు రోజుల నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 20,937 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…104 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 20,811 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1542079 కి చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 209156 గా ఉంది. కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 9904 కు పెరిగింది. ఇక ఏపీలో మొత్తం 13,23,019 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు.