ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ కేటాయించాలని ఈ లేఖలో కోరారు సీఎం జగన్. అంతేకాదు ఏపీకి కేంద్రం చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల సంఖ్య అదనంగా 30వేలకు పెంచనున్నామని.. దీని కోసం ప్రతి రోజు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని కోరారు. స్టోరేజ్ సదుపాయం లేకపోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉపయోగించగలుగున్నామని..…
రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది. అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్…
గాంధీ ఆసుపత్రి ముందు కరోనా బాధితులకు ఉచిత భోజన సౌకర్యం ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. ప్రతీ రోజు వెయ్యి మందికి భోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు రేవంత్. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు… ఈ కార్యక్రమం ప్రారంభం అయిందని..లాక్ డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే అరెస్ట్ లు చేస్తున్నారు..విచారణ పేరిట అడ్డుకుం టున్నారని…
ఆక్సిజన్ సంక్షోభం అంచున తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఉంది. ఆసుపత్రికి పంపే ఆక్సిజన్ లో కోత విధించాల్సిందిగా సరఫరాదారును ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్ వాటర్ కంపెనీ నుంచి స్విమ్స్ కి ఆక్సిజన్ వస్తుండగా.. రెండు విడతలుగా రోజుకు 14 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం 8కేఎల్ కి మించి ఆక్సిజన్ పంపించలేమని స్విమ్స్ కి తేల్చి చెప్పారు గుత్తేదారు. ప్రస్తుతం స్విమ్స్ లో 467మంది కోవిడ్ రోగులు…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మార్చేసింది. తప్పనిసరిగా ఆఫీస్‌కి వెళ్లి పనిచేసే ఉద్యోగులు కూడా కరోనా కారణంగా ఇంటినుంచే పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు కదలడంలేదు. ఒకప్పుడు ఐటి రంగానికే పరిమితమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు దాదాపుగా అన్ని రంగాలకు పాకింది. ఉపాద్యాయులు, ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వర్చువల్ విధానం ద్వారా పనిచేస్తున్నారు. మనదేశంలో కూడా ప్రస్తుతం ఇలానే జరుగుతున్నది. మంత్రుల సమావేశాలు, పాలనా పరమైన విధానాలు కూడా…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గం. కరోనా మహమ్మారి తో అమెరికా అతలాకుతలం అయ్యింది. కరోనా నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున అక్కడ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారులు ప్రజలను వ్యాక్సిన్ వేయించుకోవడానికి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలోని ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి 1 మిలియన్ డాలర్లు బహుమానంగా…
కరోనా కాలంలో ఎవరు ఏం చెప్పినా దానిని ఫాలో అవుతుంటారు. గత కొన్నిరోజులుగా కొన్ని రకాల చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేడినీళ్ళతో కరోనాకు చెక్ పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి. వేడి నీళ్లను తాగడం వలన, స్నానం చేయడం వలన కరోనా తగ్గిపోదని, 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే ఈ వైరస్ చనిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక వేడినీళ్లు తాగడం వలన శరీరంలో అవయవాలు యాక్టివ్ అవుతాయని, వేడినీళ్ళతో స్నానం చేయడం వలన కండరాల నొప్పులు తగ్గుతాయని, మెదడకు రక్తసరఫరా జరుగుతుందని నిపుణులు…
కరోనా సమయంలో అవసరం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్ సమయంలో వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా,…
తెలంగాణలో ఈరోజు నుంచి లాక్‌డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కు కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల కార్మికులకు ఇబ్బంది ఉండదని, ఆయా కంపెనీల ఐడీ కార్డులను చూపిస్తే అనుమతి ఇస్తామని డీజీపి మహెందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని డిజీపీ తెలిపారు. ప్రజలు అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడోద్దని,…
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒకవైపు కరోనా కేసులతో పాటు, మరోవైపు మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో దాదాపుగా రెండు వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పేర్కోన్నారు. బ్లాక్ ఫంగస్ కేసుల బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో వీరికోసం మెడికల్ కాలేజీకలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. బ్లాక్ ఫంగస్…