తెలంగాణలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ కారణంగా 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. అయితే, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అంతదూరం వెళ్లి క్యూలైన్లో నిలబడి వ్యాక్సిన్ తీసుకోవాలంటే అయ్యేపనికాదు. వీరికోసం జీహెచ్ఎంసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే డైరెక్ట్‌గా వారి ఇంటికి వచ్చి బూస్టర్ డోసు…
రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేని ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో కోవిడ్ లక్షణాల బారిన పడుతున్నారు జనాలు. ఫీవర్ సర్వే ప్రారంభం అయిన 9 రోజుల్లోనే 4,00,283 మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈనెల 21 నుంచి 29 వరకు నిర్వహించిన ఫీవర్ సర్వే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల ద్వారా స్పష్టమైంది. అయితే కోవిడ్ వ్యాధిపై అవగాహన…
సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్ లో కరోనా తొలికేసు నమోదైంది. రెండేళ్ల కాలంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా తొలికేసు నమోదైనపుడు దేశంలో తెలియని భయం నెలకొన్నది. కరోనా కేసులు నమోదైతే వాటిని టెస్ట్ చేసేందుకు సరైన కిట్లు, వ్యాక్సిన్లు అప్పట్లో అందుబాటులో లేవు. దీంతో కరోనా సోకితే ఏ మెడిసిన్ వాడాలి అన్నది సందిగ్ధంగా మారింది. రెండేళ్ల కాలంలో దేశంలో నాలుగు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 4 లక్షల 94 వేల…
ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశాల్లో రష్యాకూడా ఒకటి. కావాల్సినంత స్థలం ఉన్నది. వనరులు ఉన్నాయి. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ రష్యా ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో నెలకొన్నది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత రష్యాలో జనాభ క్రమంగా తగ్గిపోతూ వస్తున్నది. 1990 తరువాత జనాభా మరింత తగ్గిపోవడం ప్రారంభమైంది. అయితే, కరోనా కారణంగా ఆ దేశంలో మరణాల సంఖ్య భారీగా నమోదైంది. 2020లో రష్యా జనాభా 5 లక్షల వరకు తగ్గిపోగా, 2021 నుంచి ఇప్పటివరకు…
కెనడాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడంతో పాటుగా భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. నిబంధనలకు కఠినంగా అమలు చేస్తుండటంతో అక్కడి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. దేశంలో ఓ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నిబంధనలను మరింత కఠినం చేయడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ట్రక్ డ్రైవర్లు వేలాది ట్రక్కులతో…
కరోనా మహమ్మారి కాలంలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ప్రపంచంలో లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ ను కనిపెట్టడం, తయారు చేయడం ఒక అంశమైతే, వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితమైంది, వ్యాక్సిన్‌లో హానికరమైన బ్యాక్టీరీయా ఉన్నదా లేదా అని తెలుసుకోవడం మరో ఎత్తు. దీనికోసం ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తన నిధులను ఖర్చు చేస్తుంటాయి. వ్యాక్సిన్ సురక్షితమా కాదా అనే అంశాన్ని పీతల రక్తంతో మాత్రమే పరీక్షించినపుడు మాత్రమే తెలుస్తుంది.…
కరోనా కారణంగా జనవరి 8 నుంచి జనవరి 16 వరకు, ఆ తరువాత సెలవులను జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 31తో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తారా లేదా అనే దానిపై ఇప్పటి వరకు సందేహాలు ఉన్నాయి. అయితే, ఫిబ్రవరి 1 వ తేదీన స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమవుతున్నది. స్కూళ్లు తెరిచిన తరువాత విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినంగా…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడేందుకు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్లు, ఆహరపు అలవాట్లు తదిత అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల సారాంశాన్ని ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రీషన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ జర్నల్ ప్రకారం, వారానికి నాలుగు నుంచి 5 గ్లాసుల వరకు రెడ్ వైన్ తీసుకునేవారు కరోనా మహమ్మారి బారిన పడటం 17 శాతం వరకు తక్కువుగా ఉంటుందని పరిశోధకులు…
ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత కరోనా థర్డ్ వేవ్ భారత్‌లో కోవిఢ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు..…