కేరళలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 8,193 మంది కరోనా నుంచి కోలుకోగా, 49 మంది మృతి చెందారు. కేరళలో ఇప్పటి వరకు 51,160 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1,68,383 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు కేరళ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మొదటి వేవ్‌ను కేరళ సమర్థవంతంగా ఎదుర్కొనగా, రెండో వేవ్‌లో అత్యధిక కేసులతో పాటు మరణాలు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో కాస్త శాంతించినా అమెరికాలో కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగిపోతున్న నేపథ్యంలో అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలోని 22 దేశాలకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించింది. 80కి పైగా దేశాలను వెరీ హై రిస్క్ జోన్ దేశాల జాబితాలో సీడీసీ చేర్చింది. కాగా మరో 22 దేశాలను హైరిస్క్ దేశాల జాబితాలో చేర్చింది. లెవల్ 4 దేశాల జాబితాలో ఉంచిన దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించవద్దని…
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ సివియర్ కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక దేశాలు ఒమిక్రాన్ ను లైట్‌గా తీసుకుంటున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ కీలక హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తక్కువగా ఉంటాయని, తీవ్రత తక్కువగా ఉందని తక్కువ చేసి చూడడం పొరపాటే అవుతుందని, ఒమిక్రాన్ వేరియంట్ ఎలా విరుచుకు పడుతుంతో ఇప్పుడే అంచనా వేయలేమని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. సార్స్ కోవ్ 2 వైరస్‌ను…
ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో 10,057 కరోనా కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,27,441కి చేరింది. ఇందులో 20,67,984 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 44,935 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వైద్యులకు, వైద్యసిబ్బందికి జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విజయవాడలోని జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. జీజీహెచ్‌లో 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. 20 మంది జూనియర్ వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.…
ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా దేశంలో 2,38,018 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. నిన్నటి కేసుల కంటే ఈరోజు 20,071 కేసలు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,57,421 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 310 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 17,36,628 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఇప్పటి…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, హిమాలయాల్లో కరోనాకు చెక్ పెట్టే మొక్కలు ఉన్నాయని ఐఐటి మండి, ఐసీజీఎంబీ లు గుర్తించాయి. హిమాలయాల్లో పెరిగే రోడో డెండ్రాన్ అర్బోరియం అనే మొక్కకు కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని, ఈ మొక్కలోని పూరేకుల్లో ఫైటోకెమికల్స్ ఉన్నాయని, ఈ ఫైటో కెమికల్స్‌కు కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోడో డెండ్రాన్ అర్బోరియం మొక్కను స్థానికంగా బురాన్ష్ అని పిలుస్తారు.…
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానున్నది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుంది. జనవరి 18 నుంచి 31 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుంది. నైట్ కర్ఫ్యూతో పాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం…
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, ఒమిక్రాన్ పిల్లలపై పెను ప్రభావమే చూపిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో.. అమెరికా, యూరప్‌ల్లో అధికశాతం చిన్నారులు.. ఆస్పత్రుల్లో చేరుతున్నారు.అయితే కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ద్వారా వీటికి కళ్లెం వేయవచ్చంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అనేక దేశాల్లో కొవిడ్ మూడో దశ మొదలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ వేరియంట్ పిల్లలపైనా అధికంగానే ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొదటి రెండు దశల సమయంలో పిల్లలపై అంతగా ప్రభావం చూపని…