ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశాల్లో రష్యాకూడా ఒకటి. కావాల్సినంత స్థలం ఉన్నది. వనరులు ఉన్నాయి. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ రష్యా ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో నెలకొన్నది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత రష్యాలో జనాభ క్రమంగా తగ్గిపోతూ వస్తున్నది. 1990 తరువాత జనాభా మరింత తగ్గిపోవడం ప్రారంభమైంది. అయితే, కరోనా కారణంగా ఆ దేశంలో మరణాల సంఖ్య భారీగా నమోదైంది. 2020లో రష్యా జనాభా 5 లక్షల వరకు తగ్గిపోగా, 2021 నుంచి ఇప్పటివరకు ఆ సంఖ్య 10 లక్షలకు పైగా మరణించారని రోస్‌స్టాక్ అనే ప్రభుత్వ గణాంక సంస్థ వెల్లడించింది. కరోనా కారణంగా ఆ దేశంలో 6.60 లక్షల మంది మరణించారు.
Read: వరల్డ్ రికార్డ్: ఒంటిపై 85 స్పూన్లను ఇలా బ్యాలెన్స్ చేస్తూ…
వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగడం, మాస్క్ ధరించకపోవడం వంటి వాటి కారణంగా మరణాల సంఖ్య పెరిగింది. అయితే, పుతిన్ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి ప్రభుత్వం జనాభా పెరుగుదలపై దృష్టి సారించింది. రష్యా భౌగోళిక విస్తీర్ణానికి 14.6 కోట్ల మంది జనాభా సరిపోరని, దేశంలో జనాభాను పెంచాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పుతిన్ చెబుతూ వస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ ఇద్దరూ లేదా ముగ్గురు పిల్లల్ని కనాలని పుతిన్ ప్రభుత్వం చెబుతున్నది. ఎక్కువ మంది పిల్లల్ని కనే వారికి ప్రభుత్వం ప్రోత్సాహాకాలు ప్రకటిస్తున్నది. అయినప్పటికీ అక్కడ జనాభా సంఖ్య పెరగకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.