ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కానీ మొదట్లో కంటే ఇప్పుడు కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 8,239 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,93,227 కి చేరింది. ఇందులో 16,85,303 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 96,100 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 61 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన…
కరోనాను పారద్రోలే ప్రయత్నంలో సెలెబ్రిటీలంతా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ను వేయించుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ కోవిడ్ -19 వ్యాక్సిన్‌లో మొదటి మోతాదును తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పిక్ పోస్ట్ చేశారు కార్తీ. ఈ పిక్ లో కార్తీ హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉండడం మనం చూడవచ్చు. ఇక కరోనా పోరులో భాగంగా కార్తీ తన అన్న, తండ్రితో కలిసి తమిళనాడు ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. అంతేకాకుండా…
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో భారత్ వణికిపోయింది… మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందన్న నిపుణుల హెచ్చరికలు అందరినీ భయపెడుతున్నాయి.. ఫస్ట్ వేవ్‌లో అనారోగ్యసమస్యలతో ఉన్నవారు ఇబ్బంది పడితే, సెకండ్ వేవ్‌లో యువతను కూడా వదలలేదు మహమ్మారి.. ఇక, థర్డ్ వేవ్‌లో చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.. అయితే, థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని చెప్పలేమని.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లోనూ చాలా మంది చిన్నారులకు కోవిడ్ బారినపడ్డారని…
కోవిడ్ -19 మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితుల వల్ల దేశంలో చాలా మందిపై ఎఫెక్ట్ పడింది. సెకండ్ వేవ్ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశంలో కర్ఫ్యూ విధించడం తప్పనిసరి అవుతోంది ప్రభుత్వానికి. ఈ క్లిష్ట పరిస్థితుల కారణంగా పనిని కోల్పోయిన తన ఫ్యాన్ క్లబ్ సభ్యులకు సహాయం చేయడానికి కోలీవుడ్ స్టార్ సూర్య ముందుకు వచ్చారు. ఈ స్టార్ హీరో తన అభిమాన సంఘాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై ఆలస్యం చేయకుండా స్పందిస్తారు.…
కరోనా మహమ్మారిపై సెలవిచ్చారు నిత్యానంద స్వామి… భారత్‌తో పాటు అనేక దేశాలకు కునుకులేకుండా చేస్తున్న కోవిడ్ వైరస్‌పై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుని.. గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ను విడిచి పారిపోయిన నిత్యానంద.. కొంత కాలం ఎక్కడున్నారు కూడా ఎవ్వరికీ తెలియదు.. ఆ తర్వాత ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనేసి.. దానికి కైలాస దేశం అని పేరు కూడా పెట్టేశారాయన.. అయితే, నిత్యానంద అక్కడున్నా.. భారత్‌లో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంటారు..…
కరోనా కారణంగా ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పేదవారు… లాక్ డౌన్ వల్ల చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక ఎంతోమంది పస్తులు ఉంటున్నారు. వారి గురించి తాజాగా హీరోయిన్ రాశిఖన్నా ఓ వీడియోను షేర్ చేశారు. “ఈరోజు లక్షలాది మంది బ్రతకడానికి ఆహారమే ఆక్సిజన్ లా తయారయింది. ఈ మహమ్మారి తెచ్చిన ఏడుపుల ముందు ఆకలి కేకలు వినిపించకుండా పోయాయి. బహుశా ఆకలే వారిని కరోనా వైరస్ కంటే ముందు చంపేస్తుందేమో. జీవనాధారం కోల్పోయి సంపాదన…
ప్రస్తుతం కొవిడ్ 19 ప్రభావంతో ప్రపంచం యావత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే.. సామాన్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే కరోనా బారిన పడిన వారు హాస్పిటల్స్‌లో బెడ్స్ అందుబాటులో లేకుండా, ఆక్సిజన్ అందక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ పాండమిక్ సమయంలో సినీ రంగం కూడా కష్ట నష్టాలను భరిస్తోంది. సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది మనందరికీ పరీక్షా సమయం..ఇలాంటి సమయంలో…
దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా టెన్షన్ పెడుతోంది. అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. కీలక నేతలు కరోనా పాజిటివ్‌తో పోరాడుతున్నారు. కరోనా పంజాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్రనేతలు కరోనా బారినపడిన చికిత్సకు అనుమతించట్లేదు మావోయిస్టు పార్టీ. కాగా లొంగిపోతే చికిత్స చేయిస్తామంటున్నారు పోలీసులు. ఇటీవల మధుకర్ మృతితో సీనియర్లలో ఆందోళన నెలకొంది. మధుకర్ తో పాటు 12 మంది సీనియర్ నాయకులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరందరికి రహస్యంగా మావోయిస్టు పార్టీ…
తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినులపై అత్యాచారం చేసిన కేసులో హర్యానాలో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద బాబా.. డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. కరోనాబారినపడ్డారు.. ఆదివారం ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఇవాళ వచ్చిన రిపోర్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయియ్యింది.. కడుపులో నొప్పిగా ఉండడంతో.. రోహ్తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్)లో పరీక్షలు చేయించారు. ఆ తర్వాత గురుగ్రామ్‌లోని మెదంత ఆసుపత్రికి తరలించారు జైలు…
లాక్డౌన్ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. లాక్డౌన్ వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97,751 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 1436 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 5,91,170 కరోనా కేసులు, 3378 మరణాలు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో.. 3,614…