దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా టెన్షన్ పెడుతోంది. అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. కీలక నేతలు కరోనా పాజిటివ్‌తో పోరాడుతున్నారు. కరోనా పంజాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్రనేతలు కరోనా బారినపడిన చికిత్సకు అనుమతించట్లేదు మావోయిస్టు పార్టీ. కాగా లొంగిపోతే చికిత్స చేయిస్తామంటున్నారు పోలీసులు. ఇటీవల మధుకర్ మృతితో సీనియర్లలో ఆందోళన నెలకొంది. మధుకర్ తో పాటు 12 మంది సీనియర్ నాయకులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరందరికి రహస్యంగా మావోయిస్టు పార్టీ చికిత్స చేయిస్తోంది. కాల్పుల విరమణపై పార్టీలో చర్చ మొదలైంది.
కరోనా బారిన పడ్డ అగ్రనేతలు