హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్‌కు కితాబు ఇచ్చింది అమెరికా… కరోనాతో పాటు తాజాగా.. భారత్‌లో వెలుగుచూసిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్‌పై టీకాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్… ఎస్‌ఏఆర్‌ఎస్-సీవోవీ-2 ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కోవాగ్జిన్ చాలా ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని తేల్చింది.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి నమూనాలను సేకరించి అధ్యయనం చేసిన ఎన్‌ఐహెచ్.. ఆల్ఫా…
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ఎంతో అవసరం అనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం, రెగ్యులర్ గా శానిటైజర్ ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. అయితే ముందుగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనాలు భయపడ్డారు. కానీ ఇప్పుడు అందరిలో అవగాహన రావడంతో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా? లేదా? తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్…
వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. జూలై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేవాలు నిర్వహించాలని సిఫార్సు చేసింది పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ.. కాగా, కరోనా మహమ్మారి విజృంభణతో పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడూ పూర్తిస్థాయిలో నిర్వహించిలేదు.. పార్లమెంట్ సిబ్బంది, ఎంపీలు చాలా మంది కోవిడ్ బారినపడడంతో.. అర్థాతంగా పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ సమయంలోనే ముగించడంపై విమర్శలు చేశాయి…
నేచురల్ స్టార్ నానిలో చమత్కారి ఉన్నాడు. బేసికల్ గా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుండి వచ్చిన నానిలో క్రియేటివిటీ పాలు ఎక్కువే! మీరు జాగ్రత్తగా గమనిస్తే… అతను నటించిన సినిమాల ప్రారంభంలో వచ్చే ‘పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, కాన్సర్ కు కారకం’ అనే ప్రకటన వాయిస్ ఓసారి వినండి… అది రొటీన్ కు భిన్నంగా ‘అంతకు మించి’ అన్నట్టుగా ఉంటుంది. ఒక సినిమాలో అయితే ‘సిగిరెట్, మందు తాగకండిరేయ్… పోతారు’ అని చెప్పాడు…
సోనూ సూద్ మరోసారి తన సామాజిక బాధ్యతని చాటుకున్నాడు. ‘కవర్ జి’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రధానంగా గ్రామీణ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్న అపొహల్ని తొలగించటమే ‘కవర్ జి’ లక్ష్యం. ఎక్కడికక్కడ వాలంటీర్స్ ని తయారు చేసి ఊళ్లలోని అన్ని వర్గాల భారతీయులకి వ్యాక్సిన్ ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నారు. దీని కోసం ఆసక్తి కలవారు, సేవా భావం ఉన్న వారు ఎవరైనా ముందుకు రావచ్చని సోనూ తెలిపాడు.‘కవర్ జి’ పేరుతో సూద్ ప్రాంభించిన…
కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. అయితే… తెలుగులో ఒక్క ఆహా తప్పితే మరే ఓటీటీ సంస్థ తెలుగు నిర్మాతల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోంది. గత యేడాది కరోనా సందర్భంలో అమెజాన్ ప్రైమ్ తెలుగు మార్కెట్ ను కాప్చర్ చేయాలని, తన సత్తా చాటాలనీ భావించింది. దానికి అనుగుణంగా రెండు పెద్ద చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ కోసం తీసుకుని విడుదల చేసింది. కానీ ఆశించిన స్థాయిలో…
కరోనా మహమ్మారి రోజుకో వేరియంట్ రూపంలో ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.. ఇప్పటికే పలు దేశాలను డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతుండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ కేసు నమోదు అయ్యింది.. చిత్తూరు జిల్లా తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు వెలుగు చూసింది.. ఏప్రిల్ నెలలోనే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న బాధితుడు డెల్టా ప్లస్ వేరియంట్ బారినపడ్డాడు… ఇప్పటికే శ్యాంపిల్‌ను పుణులోని సీసీఎంబీకి అధికారులు పంపగా.. ఇవాళ అది డెల్టా ప్లస్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు వైద్యఆరోగ్య…
అతి త్వరలోనే భారత్‌లోకి ఫైజర్ టీకా రానుంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా కీలక ప్రకటన చేశారు. అత్యవసర వినియోగం కింద మరికొన్ని రోజుల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు ఆల్బర్ట్ బౌర్లా. ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ తుదిదశకు చేరుకుందని చెప్పారు. భారత్‌లో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు వినియోగంలో ఉన్నప్పటికీ వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తోంది. దీంతో విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. read also…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1362 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 612196 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1897 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 590072 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3556 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 18568 యాక్టివ్ కేసులు…
అడివి శేష్ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ తొంభై శాతం పూర్తయింది. అడివి శేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘మేజర్’ సినిమాకి శేష్ స్క్రిప్ట్ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ తిరిగి జూలైలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, ”’మేజర్’ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేయనున్నామని తెలియజేయేందుకు చాలా సంతోషిస్తున్నాను. గత ఏడాది చిట్కుల్ (హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూరు జిల్లాలో ఓ ప్రాంతం)లో ‘మేజర్’చిత్రీకరణ…