కొవిడ్ కష్ట సమయంలో బాసటగా నిలుస్తోన్న హోంబలే ఫిలింస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కొవిడ్ 19 ప్రభావంతో ప్రపంచం యావత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే.. సామాన్యులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే కరోనా బారిన పడిన వారు హాస్పిటల్స్‌లో బెడ్స్ అందుబాటులో లేకుండా, ఆక్సిజన్ అందక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ పాండమిక్ సమయంలో సినీ రంగం కూడా కష్ట నష్టాలను భరిస్తోంది. సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది మనందరికీ పరీక్షా సమయం..ఇలాంటి సమయంలో మనం అందరం ఒకరికొకరు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఆలోచనతో సినీ కార్మికులకు అండగా నిలబడటానికి ముందడుగు వేసింది ఇండియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన హోంబలే ఫిలింస్.
హోంబలే సంస్థ…రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్, 20 ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖల్లోని 3200 మంది సభ్యులకు రూ.35 లక్షలను సాయాన్ని అందించింది హోంబలే నిర్మాణ సంస్థ. అంతే కాకుండా హోంబలే నిర్మాణ సంస్థలో రూపొందుతోన్న ‘సలార్’ సినిమా కేవలం పది రోజుల చిత్రీకరణను మాత్రమే పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఆ సినిమా కోసం పని చేస్తున్న 150 మంది యూనిట్ సభ్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. గత ఏడాది పాండిమిక్ సమయంలోనూ 350 మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.5000 వేల ఆర్థిక సాయాన్ని రెండు నెలల పాటు అందించి బాసటగా నిలిచింది హోంబలే నిర్మాణ సంస్థ.
Also Read
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!