కరోనా మహమ్మారి విజృంభణతో విదేశీ ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి… కోవిడ్ కేసులు అదుపులోకి వస్తున్న తరుణంలో.. కొన్ని దేశాలు.. ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి… విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నాయి.. కానీ, భారతీయ విమానాలపై ఆంక్షలను మరోసారి పొడిగించింది కెనడా ప్రభుత్వం… సెప్టెంబర్ 21 తేదీ వరకు భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కాగా, డెల్టా వేరియంట్ వెలుగు చూడడంతో ఏప్రిల్ 22న ఇండియా నుంచి నేరుగా వెళ్లే విమానాలపై కెనడా నిషేధం విధించింది..…
కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైపోయిందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది.. మళ్లీ కరోనా కల్లోలం సృష్టించబోతోంది అని హెచ్చరించింది.. గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది కొత్తగా కరోనా మహమ్మారి బారినపడ్డారని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియేసస్.. మరో రెండు వారాల్లోగా ఆ సంఖ్య 20 కోట్లకు చేరుతోందని తెలిపారు.. అంటే రానున్న రెండో వారాల్లో ప్రపంచవ్యాప్తంగా…
కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొత్త నిబంధనలు స్పష్టంగా తెలియజేసేందుకు 33 పేజీల పుస్తకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు విడుదల చేశారు. అంతర్జాతీ ప్రేక్షకులు కేవలం టీవీల్లోనే ఒలింపిక్స్‌ను చూడాల్సి ఉంటుంది. కేవలం స్థానికులకు మాత్రమే వీటిని చూసేందుకు అనుమతి ఉంది. వారు కూడా కరోనా కట్టడికి ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. పాటలు, డ్యాన్సులతో స్టేడియంలలో హంగామా చేయడంపైనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. అటు అంతర్జాతీయ వాలంటీర్లు కూడా టోక్యో రావడానికి వీల్లేదు. జపాన్‌లో అడుగుపెట్టిన వెంటనే క్రీడాకారులంతా 14…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్‌వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే,…
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు థర్డ్ వేవ్ కొన్ని దేశాలను ఇప్పటికే టచ్ చేయగా.. రోజుకో వేరియంట్ తరహాలో కోవిడ్ కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే.. తాజా పరిస్థితులపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్.. కరోనా మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని హెచ్చరించారు.. కరోనా డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన..…
కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, భయపడకుండా ఉండటమే దీనికి మంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించడమే థర్డ్‌వేవ్ ముప్పు నుంచి రక్షణ పొంగలగమన్నారు. వైద్యులకు నాదో చిన్న విన్నపం. థర్డ్‌వేవ్‌పై భయాందోళనలు సృష్టించవద్దు. ఎందుకంటే దీనికి ప్రాథమిక సూత్రం ముందు జాగ్రత్తే గాని భయాందోళనకు గురికావడం కాదు” అని సూచించారు. థర్డ్‌వేవ్ గురించి మాట్లాడేందుకు బదులుగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్ వేవ్‌పై…
ఓవైపు కరోనా మహమ్మారి.. మరో వైపు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూల నేపథ్యంలో.. వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం.. డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) వంటి డాక్యుమెంట్ల వ్యాలిడిటీని పొడిగించింది.. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును గతంలో ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన కేంద్రం.. ఇవాళ వ్యాలిడిటీని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు మరియు రవాణా, రహదారుల…
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతుండటంతో వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇస్తున్నాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. ఇక థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు కరోనా నిబంధనలతో అనుమతులు ఇచ్చింది మహారాష్ట్ర సర్కార్. దీంతో ఈ నెల 7 నుంచే బాలీవుడ్ వర్గాలు చిత్రీకరణలకు సిద్ధం అవుతున్నాయి. అయితే టాలీవుడ్ లో థియేటర్ల ఓపెనింగ్ కు మాత్రం మరికొద్ది రోజుల వరకు పర్మిషన్…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు మహమ్మారి బారినపడ్డారు.. ఇక, వందలాది మంది ప్రాణాలు వదిలారు.. అయితే, తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం ఎంకే స్టాలిన్.. కరోనాతో ఎవరైనా గుర్తింపు పొందిన జర్నలిస్టు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. అంతేకాదు.. కరోనా సమయంలో.. జర్నలిస్టులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.2000 నుంచి రూ.5 వేలకు పెంచారు..…