కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు మహమ్మారి బారినపడ్డారు.. ఇక, వందలాది మంది ప్రాణాలు వదిలారు.. అయితే, తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం ఎంకే స్టాలిన్.. కరోనాతో ఎవరైనా గుర్తింపు పొందిన జర్నలిస్టు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. అంతేకాదు.. కరోనా సమయంలో.. జర్నలిస్టులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.2000 నుంచి రూ.5 వేలకు పెంచారు.. సరైన, ఉపయోగకరమైన సమాచారాన్ని చేరవేడయంలో.. అవగాహన కల్పించడంలో కూడా జర్నలిస్టులు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించారని తన ప్రకటనలో పేర్కొన్నారు స్టాలిన్..
ఇక, జర్నలిస్టు సంఘాల అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకున్న సీఎం స్టాలిన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మరోవైపు.. కొన్ని కోర్టు కేసుల సాకుతో తమిళనాడు ప్రభుత్వం 2020 మరియు 2021లో పలువురు జర్నలిస్టుల గుర్తింపును పునరుద్ధరించలేదు.. 2020, 2021లో చాలా మంది జర్నలిస్టుల పునరుద్ధరణ జరగలేదని అధికారులు చెబుతున్నారు.. అలాంటి పాత్రికేయులు ప్రోత్సాహకానికి లేదా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం అర్హులు కాకపోవచ్చు అంటున్నారు అధికారులు.