కరోనాపై మళ్లీ హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు థర్డ్ వేవ్ కొన్ని దేశాలను ఇప్పటికే టచ్ చేయగా.. రోజుకో వేరియంట్ తరహాలో కోవిడ్ కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే.. తాజా పరిస్థితులపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్.. కరోనా మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని హెచ్చరించారు.. కరోనా డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇది ఎక్కువగా.. తక్కువ మందికి వ్యాక్సిన్లు వేసిన దేశాల్లో విజృంభిస్తోందని.. ఆస్పత్రుల్లో చేరే కోవిడ్ బాధితుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని.. ఇప్పటికీ ఏ దేశం కూడా ఈ ప్రమాదం నుంచి బయట పడలేదన్నారు.. ఇక, డెల్టా వేరియంట్ ప్రమాదకరమైందని, వైరస్ కాల క్రమేణా మారుతున్నందున దానిపై పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్లను 98 దేశాల్లో గుర్తించామని, చాలా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు డబ్ల్యూహెచ్‌వో చీప్.. మరోవైపు.. కోవిడ్ బారినపడకుండా.. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం.. రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడంతో ఎంతో కీలకం అన్నారు.. ఇళ్లకు సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలన్న ఆయన.. వచ్చే ఏడాది నాటికి ప్రతి దేశ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
తాజావార్తలు
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!