సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది.. ఇప్పటికే అప్రమత్తమైన చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.. ముఖ్యంగా విదేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు.. ఇక, భారత్ కూడా విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు, ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ముఖ్యంగా 11 హై రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు తప్పనిసరి చేసింది.. కొత్త వేరియంట్‌తో అలెర్ట్ అయిన తెలంగాణ సర్కార్.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో…
దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ వేరయింట్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాలయాల్లో విద్యార్థులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 72 గంటల్లో తెలంగాణ, కర్ణాటకలోని విద్యాసంస్థల్లో వంద మందికి కరోనా సోకింది. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితం కళాశాలలో జరిగిన వేడుకల తరువాత కేసులు బయటపడ్డాయి. దీంతో…
మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆమె.. గతంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఈ శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది కోర్టు.. ఆమె కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, మిలిటరీకి వ్యతిరేకంగా ఇతరులను ప్రేరేపించారని రుజువు కావడంతో ఈ తీర్పును వెలువరించింది ప్రత్యేక కోర్టు.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూకీపై అనేక ఆరోపణలు మోపబడ్డాయి.. వరుసగా అన్నింటిపై…
ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిమ్రాన్ ఇప్పటికే 46 దేశాలను చుట్టేసింది.. అందులో భారత్ కూడా ఉంది.. మన దేశంలో 20కు పైగా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.. మరోవైపు.. విదేశాల నుంచి ముఖ్యంగా ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. టెస్టులను తప్పనిసరి చేసింది.. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1వ తేదీన బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అంతా టెన్షన్…
భారత్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి స్పల్పంగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 8,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరో 211 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో.. 8,834 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,41,561కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 3,40,69,608కి చేరింది.. ఇక,…
తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంటరైయిందా అనే అనుమాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి తెలంగాణకు 1000 మంది వచ్చారు. వీరందరిని టెస్టులు చేశామని వైద్యాఆరోగ్య శాఖ చెప్పింది. ఇందులో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఒమిక్రాన్ వేరింయట్ కాదా అనేది నిర్ధారించేందుకు జీనోమ్ స్వీకెన్సీంగ్ ల్యాబ్‌కు పంపించామని వైద్యాఆరోగ్య శాఖ తెలిపింది. వీటి ఫలితాలు రెండు, మూడు రోజుల్లో వస్తాయని తెలిపారు. కోవిడ్‌ను రాష్ర్ట ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని హెల్త్ డైరెక్టర్ ఇప్పటికే చెప్పారు. కరోనా కేసులను దాచిపెడుతున్నామన్న…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది.. ఇప్పటికే భారత్‌లోనూ ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి.. కరోనాపై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని గుర్తించిన భారత్.. విస్తృస్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది.. రికార్డు స్థాయిలో 125 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసింది.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే తీసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికా వెలుగుచూసిన ఈ వైరస్ క్రమంగా ప్రంపచదేశాలను పాకిపోతోంది.. ఇక భారత్‌లోనూ ఈ వేరింట్ కేసులు బయటపడ్డాయి.. ఇప్పటికే 20కి పైగా కేసులు నమోదయ్యాయి.. అయితే, తెలంగాణలో ఈ వేరింయట్ కేసులు ఇంకా వెలుగుచూడలేదు.. విదేశాల నుంచి వచ్చినవారి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది.. కోవిడ్ పాజిటివ్‌గా తేలినా.. ఒమిక్రాన్‌గా నమోదైన కేసులు ఇప్పటి వరకు జీరోగానే ఉన్నాయి. కానీ, తెలంగాణకు కూడా ఆ మహమ్మారి…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,693 శాంపిల్స్ పరీక్షించగా… 156 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 147 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,943కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,69,157కు పెరిగింది. ఇక,…
ఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,979 శాంపిల్స్ పరీక్షించగా.. 154 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 177 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల…