ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిమ్రాన్ ఇప్పటికే 46 దేశాలను చుట్టేసింది.. అందులో భారత్ కూడా ఉంది.. మన దేశంలో 20కు పైగా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.. మరోవైపు.. విదేశాల నుంచి ముఖ్యంగా ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. టెస్టులను తప్పనిసరి చేసింది.. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1వ తేదీన బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అంతా టెన్షన్ పడ్డారు.. జీనోమ్ సీక్వెన్స్కోసం ఆమె నమూనాలు పంపించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. అయితే, జీనోమ్ నివేదికలో ఆ మహిళకు ఒమిక్రాన్ నెగెటివ్‌గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. కాగా, ఈ నెల 1వ తేదీన యూకే నుంచి వచ్చిన 35 ఏళ్ల మహిళ స్వస్థలం రంగారెడ్డి జిల్లా… మరోవైపు ఇతర దేశాల నుంచి ఇటీవలి కాలంలో హైదరాబాద్‌కు చేరుకున్న 12 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. వారి జీనోమ్ సీక్వెన్స్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.
Read Also: అంబేద్కర్ చూపిన మార్గంలో జనసేన ప్రస్థానం-పవన్ కల్యాణ్
ప్రస్తుతానికి తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగుచూడకపోయినా.. ఈ పాజిటివ్ కేసుల్లో ఎప్పుడు.. ఏ కేసు పాజిటివ్‌గా నమోదు అవుతుందోనన్న టెన్షన్ మాత్రం వెంటాడుతోంది.. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ వివిధ దేశాల్లో, భారత్‌లోనూ వెలుగుచూస్తున్న తరుణంలో.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. నివారణ చర్యలకు పూనుకుంది.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.. లేని పక్షంలో రూ. 1000 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.