కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికా వెలుగుచూసిన ఈ వైరస్ క్రమంగా ప్రంపచదేశాలను పాకిపోతోంది.. ఇక భారత్‌లోనూ ఈ వేరింట్ కేసులు బయటపడ్డాయి.. ఇప్పటికే 20కి పైగా కేసులు నమోదయ్యాయి.. అయితే, తెలంగాణలో ఈ వేరింయట్ కేసులు ఇంకా వెలుగుచూడలేదు.. విదేశాల నుంచి వచ్చినవారి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది.. కోవిడ్ పాజిటివ్‌గా తేలినా.. ఒమిక్రాన్‌గా నమోదైన కేసులు ఇప్పటి వరకు జీరోగానే ఉన్నాయి. కానీ, తెలంగాణకు కూడా ఆ మహమ్మారి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్ ఇంకా కనుమరుగు కాలేదని.. మరోవైపు ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందని తెలిపారు వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు.
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు తెలంగాణలోనూ విస్తరించే ప్రమాదం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. అంతా కచ్చితంగా మాస్కులు ధరించాలి, పరిశుభ్రత పాటించాలి, భౌతికదూరాన్ని పాటించాలని సూచించిన ఆయన.. మరోవైపు కోవిడ్ టీకా రెండు డోసులు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని.. కానీ, 11 ‘రిస్క్’ దేశాల నుంచి వచ్చిన 979 మంది వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు శ్రీనివాసరావు. అందులో పాజిటివ్ వచ్చి టిమ్స్‌లో చికిత్స పొందుతున్న 13 మంది క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఒక ఒమిక్రాన్‌పై మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఇప్పటి వరకు వెలువడిన విశ్లేషణలు, నివేదికల ఆధారంగా తెలంగాణలో జనవరి 15వ తేదీ తర్వాత కోవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. ఫిబ్రవరిలో తీవ్రస్థాయికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. మరోవైపు, ఫిబ్రవరి నాటికి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు శ్రీనివాసరావు.