ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇండియా అలర్ట్ అయింది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ను వేగం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇండియాలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు సగటున 50 లక్షలకు పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రయ మందకోడిగా సాగింది. ఎప్పుడైతే ఒమిక్రాన్ వేరియంట్‌ను వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించిందో అప్పటి నుంచి వ్యాక్సినేషన్‌ను మరింత వేగంవంతం చేశారు. Read:…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు నేడు భారీగా పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,495 శాంపిల్స్ పరీక్షించగా… 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 156 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,787కు చేరుకోగా… రికవరీ కేసులు 6,69,010కు పెరిగాయి.. ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 32,036 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 186 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందరు. ఇదే సమయంలో 191 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,05,39,041 కు చేరింది.. మొత్తం…
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.. ఊహించని విధంగా స్పీడ్‌గా విస్తరిస్తూ వస్తున్న ఈ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలను తాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది.. అయితే, ఇదే సమయంలో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి.. ఇప్పటికే ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశాయి ఆయా దేశాలు.. ఒమిక్రాన్ మరింత విజృంభిస్తే.. మరిన్ని ఆంక్షలు తప్పవని.. అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిస్థాయిలో రద్దుచేసే అవకాశం లేకపోలేదని…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్… అన్ని దేశాలు అంక్షలు విధించినా క్రమంగా విస్తరిస్తూనే ఉంది… జట్ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసే పనిలోపడిపోయింది.. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్ బారినపడి ఎవ్వరూ మృతిచెందకపోవడం ఊరట కలిగించే విషయమే.. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 38 దేశాలకు వ్యాప్తి చెందినట్టు వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ఈ వేరియంట్ ఆందోళనకరమేనని హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో.. అయితే ఇప్పటి ఈ మహమ్మారితో ఎవరూ ప్రాణాలు వదలలేదని పేర్కొంది..…
ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో నివారణ చర్యలు చేపడుతున్నా దేశాలు.. ఇక, భారత్‌లోని రాష్ట్రాలు కూడా ఈ మహమ్మారి విజృంభించకుండా కీలక నిర్ణయాలు తీసుకుంఉటన్నాయి.. ఇక, ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం.. ముందుగా సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్, మంత్రి గోవింద కారజోళ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, సీనియర్ అధికారి మంజునాథ్ ప్రసాద్, బీబీఎంపీ అధికారులు, నిపుణులతో…
కరోనా మహమ్మారి ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారత్‌తో పాటు చాలా దేశాలను ఇబ్బందులకు గురిచేసింది.. ఫస్ట్ వేవ్‌ను కాస్త లైట్ తీసుకోవడంతో సెకండ్ వేవ్ విరుచుకుపడింది.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పాటు.. మరణాల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక, థర్డ్ వేవ్ ముప్పు ఉందంటూ ఎప్పటి నుంచి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే, ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ మొదలైందా?…
కరోనా కారణంగా థియేటర్లపై ఆంక్షలువ విధిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీని పరిశ్రమకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు తీసుకోలేమని ఆయన తెలిపారు.ఇప్పటికే కరోనా కారణంగా గత రెండేళ్లుగా సీని పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుందని తెలిపారు. సినిమా పరిశ్రమను నమ్ముకుని ఎందరో ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. వారి ఉపాధిపైన దెబ్బకొట్టలేమని మంత్రి వెల్లడించారు. మొదటి…
ఆందోళన వద్దు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు మంత్రి హరీష్‌రావు.. ఇవాళ బాలానగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖానను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు.. కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు…