ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్ నుంచి ముంబాయి మీదుగా విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వైరస్ సంక్రమించింది. విజయనగరం జిల్లాలో రెండు దఫాలుగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ సీసీఎమ్బీకి శాంపిల్స్ పంపారు అధికారులు. జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. దీంతో అలెర్ట్ అయింది…
కరోనా వైరస్ నుంచి రక్షణకోసం మాస్క్‌ను ధరిస్తున్నాం. మాస్క్‌ను పెట్టుకోవడం ద్వారా కరోనా నుంచి కొంతమేర రక్షణ పొందవచ్చు. అయితే, కరోనా ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే ర్యాపిడ్ లేదా ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఆర్టీపీసీఆర్ లేదా ర్యాపిడ్ పీసీఆర్ పరీక్షలు ఖరీదైవి. ర్యాపిడ్ పరీక్షల్లో ఎంత వరకు కరోనా వైరస్‌ను డిటెక్ట్ చేయవచ్చో చెప్పలేం. Read: సౌతిండియా ‘టాప్’ లేపిన ‘పుష్ప’ ఐటమ్ సాంగ్ అయితే, జపాన్‌కు చెందిన క్యోటో…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,978 శాంపిల్స్ పరీక్షించగా… 188 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 193 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,142 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,70,246 కు పెరిగాయి..…
దేశంలో “ఒమిక్రాన్”!వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాసారు. “కొవిడ్” నిబంధనలపై నిర్లక్ష్యంగా ఉండొద్దని, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై మరింత దృష్టిపెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న కేంద్రం… కేరళ,…
ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,131 శాంపిల్స్ పరీక్షించగా.. 156 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 188 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,46,537 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,74,708…
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కి చేరింది. ఢిల్లీలో మాత్రం ఇప్పటివరకు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. దేశంలో మహారాష్ట్రలో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్రానికి…
ఓమిక్రాన్ వేరింయట్ వేగంగా వ్యాప్తి నేపథ్యంలో, కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి కేంద్రం జారీ చేసిన పరిమితులు/మార్గదర్శకాల జాబితా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తులందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. మాస్క్ ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. సంస్థలు లేదా దుకాణాలు మాస్క్ లేని వ్యక్తిని తమ ప్రాంగణంలోకి అనుమతిస్తే పరిస్థితి తీవ్రతను…
ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భయంతో అన్ని దేశాలు బూస్టర్ డోస్ పై చర్చను ప్రారంభించాయి. అభివృద్ధి చెందిన దేశాలలో బూస్టర్ డోస్‌ను వారి ప్రజలకు ఇస్తున్నాయి. అయితే దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. బూస్టర్ డోస్‌ల పేరుతో వ్యాక్సిన్ నిల్వలను అంటిపెట్టుకోవద్దని వాటి పేద దేశాలకు అందజేయాలని సూచించింది. అయితే మనదేశంలో బూస్టర్ డోస్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,793 శాంపిల్స్ పరీక్షించగా.. 142 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 188 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,15,406 కు చేరుకోగా……
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర హోమ్ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ. 100 జరిమాన విధింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25…