కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ థర్డ్ వేవ్‌కు కూడా దారితీసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నాయి.. అయితే, ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ సమయంలోనూ చిన్నారులు కరోనా బారినపడ్డా.. ఇప్పుడు ఒమిక్రాన్ చిన్నారులపై పడగ విప్పుతుందా? అనే టెన్షన్ మొదలైంది.. దానికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే.. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో మొదటి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాకు…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. వేగంగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేశారు. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో ఎన్నో రకాల వ్యాక్సిన్ల అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల పనితీరుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. దీనికి కారణం హాంకాంగ్ శాస్త్రవేత్తలు అందించిన సర్వే అని చెప్పవచ్చు. చైనాకు చెందిన సీనోఫామ్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేసింది. కోట్లాది మంది ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. …
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు పెరుగుతూ.. తాగుతూ వస్తున్నాయి. అయితే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,071 శాంపిల్స్ పరీక్షించగా.. 163 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 162 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,08,62,705 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్…
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణలో అడుగు పెట్టేసింది.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిపోయింది.. మరో వ్యక్తికి ఒమిక్రాన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు.. ఒమిక్రాన్ కేసులో హైదరాబాద్‌లో వెలుగుచూసిన సందర్భంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు.. విదేశాల నుంచి…
క్రమంగా ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయింది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పటికే భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు తెలంగాణను కూడా తాకింది. నిన్నటి వరకు భారత్‌లో 37 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏపీలోనూ ఒక కేసు వెలుగుచూసింది.. ఇప్పుడు తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.. అయితే, మరో వ్యక్తికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని చెబుతున్నారు.. కెన్యా,…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. జట్ స్పీడ్‌తో ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉంది.. అయితే, ఒమిక్రాన్ వేగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది… మరింత అప్రమత్తత అవసరమని వార్నింగ్ ఇస్తోంది.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ కేసులు ఇప్పటికే 77 దేశాల్లో నమోదు అయినట్టు తెలిపారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్.. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించే పనిలో పడిపోయారని వెల్లడించారు.. ఇదే…
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 6,984 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 247 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,710,628 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,76,135 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,562 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గత రెండు సంవత్సరాల నుంచి భయపెడుతూనే ఉంది. ఇప్పటికే యావత్త ప్రపంచ దేశాలు డెల్టా వేరియంట్‌తో భయపడుతుంటే.. గత నెల దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అయితే కరోనా బాధితులకు పాక్స్‌లొవిడ్ మాత్ర ఇస్తే 90 శాతం ప్రభావం చూపుతోందని ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ తెలిపింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న కరోనా బాధితులకు ఈ మాత్రతో 90 శాతం వరకు రక్షణ కలుగుతుందని ఫైజర్ వెల్లడించింది.…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29, 228 శాంపిల్స్ పరీక్షించగా.. 132 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 186 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,08,27,634 కు…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను కూడా టెన్షన్ పెడుతోంది ఒమిక్రాన్.. యూఎస్‌లో శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దాదాపు 30 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరోవైపు.. కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటింది… ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ…