భారత్‌లో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయి… ఈ రోజు వారి కేసుల సంఖ్య ఐదు వేల చేరువగా వెళ్లింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 252 మంది కోవిడ్ బాధితులు మృతిచెంచారు.. ఇదే పమయంలో 7,995 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం దేశ్యాప్తంగా…
ప్రపంచం మొత్తంమీద ప్రస్తుతం కరోనాతో అత్యంత ఇబ్బందులు పడుతున్న దేశం ఏంటని అంటే బ్రిటన్ అని టక్కున చెప్పేస్తున్నారు. సౌతాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్‌లు ఇప్పుడు అత్యధికంగా బ్రిటన్‌లోనే కనిపిస్తున్నాయి. రోజుకు వందల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశం అప్రమత్తం అయింది. గతంలో విధించిన లాక్‌డౌన్ ల దెబ్బకు ఆర్థికంగా కుదేలైంది. ప్రజలను మహమ్మారుల నుంచి బయటపడేసేందుకు ప్రస్తుతం ఆంక్షలు అమలు చేస్తున్నది. Read: యూరప్‌ను వణికిస్తున్న ఒమిక్రాన్… ఫ్రాన్స్‌లో…
భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న సంగతి తెల్సిందే. వ్యాక్సినేషన్‌లో భారత్ ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే దేశంలో సగానికి పైగా మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందజేశారు. IANS-Cvoter కోవిడ్ వ్యాక్సిన్ ట్రాకర్ సర్వే ప్రకారం.. జనాభాలో 98శాతం కంటే ఎక్కువ మంది కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తేలింది. దేశంలోని 90 కోట్ల మంది వయోజన జనాభాలో 81 కోట్ల మందికి పైగా ప్రజలు కోవిడ్ 19…
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్.. భారత్‌లోకి ప్రవేశించింది.. క్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ కేసు వెలుగు చూడడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు బయటపడిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగంపై సమీక్ష చేపట్టనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమీక్ష సమావేశం జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు లేకపోయినా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం వైఎస్…
సౌతాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉంది.. దీంతో.. కొత్త వేరియంట్‌పై కూడా రకరకాల పరిశోధనలు మొదలయ్యాయి.. ఒమిక్రాన్‌పై ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం ఎంత? అనే దానిపై కూడా ఫోకస్ పెట్టారు.. అయితే, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది.. కరోనా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ఒమిక్రాన్ తగ్గిస్తుందని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో.. ఇక, ఒమిక్రాన్‌కు డెల్టా కంటే వేగంగా వ్యాప్తించే గుణం ఉందని…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26,625 శాంపిల్స్ పరీక్షించగా… 146 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 189 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,288కు చేరుకోగా… రికవరీ కేసులు 6,70,435కు పెరిగాయి.. ఇక, మృతుల…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు స్థిరంగా ఉంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,859 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 160 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 201 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,77,396 కు చేరింది.. మొత్తం…
ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన తరువాత ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ కోసం శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాల్సి ఉంటుంది. జీనోమ్ సీక్వెన్సింగ్ నుంచి నిర్ధారణ పూర్తయ్యి ఫలితాలు వచ్చే సరికి రెండు వారాల సమయం పుడుతున్నది. నెగిటివ్ వస్తే సరే, పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి? ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం తీసుకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు…
రేపటి నుంచి పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనున్న వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. రోస్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, కైల్ మేయర్స్‌తో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నలుగురిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచినట్లు విండీస్ బోర్డు ప్రకటించింది. అయితే షెడ్యూల్ ప్రకారమే టీ20 సిరీస్…
ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకున్న సందర్భంలో కొత్త కరోనా వేరింయట్ ఒమిక్రాన్‌తో మళ్లీ గతంలోని లాక్ డౌన్ లాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి.తాజాగా ఒమిక్రాన్ వేరింయట్‌పై పలు ఆసక్తికర విషయాలను శాస్ర్తవేత్తలు బయటపెట్టారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేపడుతున్నారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్‌తో రీఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉందని జొహెన్స్‌బర్గ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. గతంలో ఇన్‌ఫెక్షన్ కారణంగా వెలువడిన రోగనిరోధక శక్తిని కూడా తట్టుకునే లక్షణం ఒమిక్రాన్‌కు ఉందని వారు…