కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసి క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా ఒమిక్రాన్ బారినపడిపోయింది.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.. 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించింది అమెరికా.. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్.. శీతాకాలంలో మహమ్మారి మరణాలు, తీవ్ర అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటి వరకు వ్యాక్సిన్…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరింది. తాజాగా హన్మకొండ, హైదరాబాద్ చార్మినార్ ప్రాంతాలలో కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. వీరిలో 8 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారని, మరో వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడన్నారు. ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేశారు. Read Also: హన్మకొండలో ఒమిక్రాన్ కలకలం..ఓ…
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్‌లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత…
దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. జనవరి నాటికి ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని ఇప్పటికే పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. నూతన సంవత్సర వేడుకల వేళ ఒమిక్రాన్ వేరియంట్ మరింతమందికి సోకుతుందనే ఉద్దేశంతో డిసెంబర్ 31వ తేదీ, జనవరి 1వ తేదీన రెండు రోజుల పాటు దేశం మొత్తం లాక్ డౌన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుందని…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా సార్స్‌కోవ్ 2 వైరస్ మొదట చైనాలోని పూహన్‌లో కనిపించింది. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యి ఉంటుందని చాలా కాలంగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నది. అయితే, చైనా అలాంటిది ఏమీ లేదని, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని, అక్కడి నుంచి ఇతరులకు వ్యాపించిందని చెప్తూ వచ్చింది. అయితే, కెనడాకు చెందిన నిపుణులు సైతం…
దేశంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త వేరియంట్ టెన్షన్ పట్టుకుంది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాపించే లక్షణాలు ఉండటంతో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 77 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ప్రతిరోజు కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కిట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపి రిజల్డ్ వచ్చేసరికి అలస్యం అవుతున్నది. ఈలోగా ఒమిక్రాన్ ఏవైనా ఉంటే అవి సామాజికంగా వ్యాపించడం మొదలుపెడతాయి. ఇది…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్‌లో ఎంటరైంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించడం.. వారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఎంట్రీతో అప్రమత్తం అయ్యారు అధికారులు.. ఇక, ఆ ఇద్దరూ మొహిదీపట్నం టోలీచౌకీ ప్రాంత వాసులే కావడంతో.. ఆ…
కరోనా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మృత్యు కేళి మరువక ముందే ఒమిక్రాన్ రూపంలో మరో వేరింయట్‌తో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ కొత్త వేరింయట్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. తాజాగా బ్రిటన్‌లో మునుపెన్నడు లేని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ మొదలైన నాటి నుండి బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 78, 610 కొత్త కేసులు వెలుగుచూశాయి. జనవరిలో నమోదైన గరిష్ట సంఖ్య కన్నా 10 వేలు…
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,974 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 343 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,18,602 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,76,478 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,245 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది…