కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసి క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా ఒమిక్రాన్ బారినపడిపోయింది.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి.. 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించింది అమెరికా.. ఈ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్.. శీతాకాలంలో మహమ్మారి మరణాలు, తీవ్ర అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే ఆ పని చేయాలని సూచించారు.. అంతేకాదు.. బూస్టర్ డోసులను సైతం వీలైనంత త్వరగా తీసుకోవాలని స్పష్టం చేశారు. అప్పుడే మీరు మరణం నుంచి తప్పించుకుంటారు.. తీవ్ర అస్వస్థత ముప్పు కూడా తప్పుదుందని సూచించిన ఆయన.. వ్యాక్సిన్ వేసుకోని వారు వెంటనే ఫస్ట్ వేసుకోవాలని.. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇది ఎంతో అవసరం అన్నారు.
Read Also: అక్కడ నవ్వడంపై నిషేధం.. కారణం ఇదే..!
ఇక, అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతుందని శాస్తవేత్తలు హెచ్చరించారు.. డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.. ఇప్పటికే 77 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు.. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఒమిక్రాన్‌తో పోరాడటానికి సిద్ధం అవుతున్నాయి.. టీకాలు వేయడం విస్తృతం చేస్తున్నాయి. ఈ వేరియంట్‌ను ప్రపంచ ప్రజారోగ్యానికి అతిపెద్ద ముప్పు గా పేర్కొంది జీ7.. దేశాల మధ్య సహకారం, దానికి సంబంధించిన డేటాను పంచుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) గణాంకాల ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన దేశమైన యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుతం రోజుకు సగటున 1,150 కోవిడ్-19 మరణాలను నమోదు చేస్తున్నట్టు చెబుతున్నాయి. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో, యునైటెడ్ స్టేట్స్‌లో సగటు రోజువారీ ఇన్‌ఫెక్షన్ కేసులు 35 శాతం పెరిగడం ఆందోళనకు గురిచేస్తున్నాయి.