ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. 24 గంటల్లో 47,884 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,92,227 కి చేరింది. ఇందులో 20,63,516 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,204 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 14,507 మంది మృతి చెందినట్టు హెల్త్…
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ భారీ నష్టాన్ని మిగిల్చాయి.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ విరుచుకుపడుతోంది.. ఈ సమయంలో.. కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది ప్రభుత్వం.. ఇక, బూస్టర్ డోసును కూడా ప్రారంభించింది.. మొదటగా ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు.. 60 ఏల్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.. ఇదే సమయంలో.. అసలు బూస్టర్ డోసు ప్రభావం ఎంత? అనే చర్చ కూడా సాగుతోంది.. అయితే, వ్యాక్సిన్ల ప్రభావంపై దేశీయంగా అధ్యయనం జరగకపోయినా,…
భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది.. ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదు అవుతుండడంతో.. ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ఓవైపు నివారణ చర్యలను పూనుకుంటూనే.. మరోవైపు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుండగా.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశానికి సిద్ధం అయ్యారు…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనాలో మూడు నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. సుమారు 20 మిలియన్ల మంది ప్రజలను ఇంటికే పరిమితం చేశారు. ఇక కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వారి కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. సాధారణ ఆసుపత్రుల్లో మాదిరిగా ఒపెన్‌గా మంచాలు ఏర్పాటు చేయుండా ఒక్కో పేషేంట్‌ను ఉంచేందుకు ఒక్కో ఐరన్ క్యాబిన్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్యాబిన్‌లో ఉడెన్ బెడ్‌తో పాటు టాయిలెట్ వంటి…
అమెరికా అంటువ్యాధుల కమిటీ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కరోనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ కేసులు అమెరికాలో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను అందిస్తున్నా కేసులు పెరుగుతుండటంపై సర్వత్రా అందోళన పెరుగుతున్నది. కరోనాను సమూలంగా అంతం చేయడం అసాధ్యమని డాక్టర్ ఫౌచీ పేర్కొన్నారు. కరోనాతో కలిసి జీవించాల్సిందే అని కుండబద్దలు కొట్టారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరిలో వైరస్ కనిపిస్తుందని, అయితే, వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఆ వ్యాక్తుల్లో వ్యాధి తీవ్రత…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఒక్కోసారి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం 2 వేల వైపు పరుగులు పెడుతూనే ఉంది.. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి ప్రతినిథ్యం వహిస్తున్న పయ్యావుల కేశవ్‌కు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సూచలన మేరకు ఆయన…
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు కేసుల సంఖ్య 15.8 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, దేశంలో పాజిటివిటీ రేటు పది శాతం దాటిపోయింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 9,55,319 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 442 మంది మృతి చెందగా, 60,405 మంది కోలుకున్నట్టు కేంద్ర…
కరోనా మహమ్మారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. యూరప్, అమెరికా దేశాలను ఒమిక్రాన్ డామినెట్ చేయడంతో అక్కడ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అమెరికాలో రోజుకు 11 నుంచి 13 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అక్కడి చాలా రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రోజుకు లక్ష మందికిపైగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇండియాలోనే ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగానే కేసులు పెరుగుతున్నాయి. అయితే, డెల్టా కంటె ప్రమాదకరం కాదని నిపుణులు…
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు కాస్త తగ్గినా కోవిడ్ ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోవిడ్ టచ్ చేసింది.. సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు కోవిడ్ బారినపడగా.. మరోవైపు రాజకీయ నేతలను కూడా కోవిడ్ వదలడం లేదు.. తాజాగా, తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణకు కరోనా పాజిటివ్‌గా తేలింది… దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీలో…
మధ్యప్రదేశ్‌లో కరోనా కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు, నిబంధనలను అమలు చేస్తున్నది. వేడుకలకు జనాల పరిమితికి మించి జనాలను అనుమతించడంలేదు. ఇక అంత్యక్రియలకు కూడా పరిమితికి మించి అనుమతించడం లేదు. అయితే, రాజ్‌గడ్‌జిల్లాలోని దాలుపురా గ్రామంలో ఓ వానరం మృతి చెందడంతో దానికి గ్రామస్తులు సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. వానరం అంత్యక్రియలకు గ్రామస్తులంతా కదలివచ్చారు. ఈ అంత్యక్రియల్లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. అంత్యక్రియల అనంతరం గ్రామస్తులంతా చందాలు వేసుకొని భోజన…