కరోనాతో కలిసి జీవించేందుకు తాము సిద్దంగా ఉన్నామని అంటున్నారు సౌతాఫ్రికా ప్రజలు. ఇప్పటికే లాక్‌డౌన్, క్వారంటైన్ వంటి ఆంక్షల కారణంగా చాలా నష్టపోయామని, ఇకపై ఎలాంటి ఆంక్షలను విధించబోమని సౌతాఫ్రికా ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసింది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు అచరణయోగ్యమైన నిర్ణయాలను తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఆంక్షల విధింపు కారణంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, సామాజిక అంశాలపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని అక్కడి ప్రభుత్వం తెలియజేసింది. కోవిడ్ 19 ఆంక్షలను ప్రపంచం గుడ్డిగా అనుసరించకూడదని, స్థానికంగా ఆచరణ యోగ్యమో కాదో తెలుసుకొని ఆంక్షలను విధించాలని సౌతాఫ్రికా ప్రభుత్వం తెలియజేసింది. సౌతాఫ్రికాలో ఇప్పటి వరకు కరోనాతో సుమారు 93 వేల మంది మృతి చెందారు.
Read: పట్నం బాట పట్టిన జనం… విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్
పాజిటివ్ కేసులు అధికంగానే ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మొదటగా ఈ దేశంలోనే బయటపడ్డాయి. ప్రపంచదేశాలన్ని కోవిడ్, ఒమిక్రాన్ భయంతో వణికిపోతుంటే, దక్షిణాఫ్రికా మాత్రం ఆంక్షలు విధించేందుకు ససేమిరా అంటోంది. కఠినమైన లాక్‌డౌన్ వంటివి విధించడం వలన ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నా ఆర్థికంగా చీకటి ఖండం భారీగా దెబ్బతిన్నది అనే విషయం వాస్తవం. ఒమిక్రాన్‌కు ముందు వచ్చిన వైరస్‌ల ద్వారా ప్రజలు కొంతమేర వ్యాధినిరోధక శక్తిని ప్రజలు పెంచుకున్నారని, ఇప్పుడు ఎదురైన ఒమిక్రాన్‌ను ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొంటారని సౌతాఫ్రికా ప్రభుత్వం చెబుతున్నది. అయితే, ప్రాథమిక జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలని సౌతాఫ్రికా ప్రభుత్వం హెచ్చరించింది.