యూరప్ లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కరోనా కారణంగా బ్రిటన్ అతలాకుతలం అయింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఈ దేశంలోనే విధ్వంసం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా ఈ దేశంలో ఒమిక్రాన్ విరుచుకుపడింది. వ్యాక్సిన్‌ను అందిస్తుండటంతో కరోనా బారిన పడినప్పటికీ పెద్దగా మరణాలు సంభవించలేదు. దీంతో కరోనా మొదటి వేవ్ సమయంలో 14 రోజుల క్వారంటైన్ ఉండగా, ఆ తరువాత వారం రోజులకు తగ్గించారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పుడిప్పుడు తగ్గుముఖం పడుతుండటంతో క్వారంటైన్ సమయాన్ని వారం రోజుల నుంచి 5 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం.
Read: ఇండియాలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు…
కోవిడ్ ఎమర్జెన్సీ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. జరిమానాలు, లీగల్‌గా చర్యలు తీసుకోవడం వలన కరోనా కేసులు తగ్గుతాయని అనుకోవడం లేదని, ప్రత్యామ్నాయంగా కోవిడ్ ను కట్టడి చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా ఆంక్షలపై ఇప్పటికే బ్రిటన్‌లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది.