కరోనా మరోసారి పంజా విసురుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వైరస్ పలకరించింది.. తాజాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది.. అయితే, ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఏజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ఇదే సమయంలో.. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ నిర్ధారణ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు స్పీకర్ పోచారం.. కాగా, కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ కోవిడ్ బారినపడ్డారు స్పీకర్.. థర్డ్ వేవ్ టైంలోనూ మరోసారి ఆయనకు కోవిడ్ సోకింది.
Read Also: తెలంగాణలో కఠిన ఆంక్షలు..? కీలక భేటీకి సిద్ధమైన కేసీఆర్