కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎన్ని ఆంక్షలు విధించినా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారంతో పోలిస్తే దాదాపు 30వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 703 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,66, 027కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,88,396కి చేరుకుంది.
Read Also: మధుమేహం రోగులకు శుభవార్త… అందుబాటులోకి సరికొత్త మాత్ర
మరోవైపు దేశంలో గడిచిన 24 గంటల్లో 2,51,777 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం 20,18,825 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 17.94 శాతానికి పెరిగింది. అటు ఇండియా వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 9,692గా నమోదైంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,60,43,70,484 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 70,49,779 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు ప్రకటించింది.