స్కూళ్లలో కరోనా కలకలం.. 10 శాతం కేసులు అక్కడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా థర్డ్‌వేవ్ విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగానే కాదు.. రాష్ట్రంలోనూ కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఇక, స్కూళ్లపై పంజా విసురుతోంది మహమ్మారి.. ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.. తాజాగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు కరోనా పొజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల తర్వాత అమాంతం కొత్త కేసులు పెరుగుతూ పోతున్నాయి.. గత ఐదు రోజుల్లో ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో 147 మందికి పైగా కరోనా సోకిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..
Read Also: నరేంద్ర మోడీ పాపులారిటీ.. ప్రపంచంలోనే టాప్ స్పాట్..
Also Read
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
నిన్న ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 772 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 10 శాతం కేసులు పాఠశాలల్లో నమోదు అయినవే కావడం కలవరపెట్టే అంశం.. రోజురోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో అటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.. కరోనా ఉధృతి తగ్గేవరకు పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. కాగా, కోవిడ్ ఉధృతి కారణంగా చాలా రాష్ట్రాలు స్కూళ్లకు సెలవులు ఇచ్చాయి.. కానీ, ఏపీలో ఆ డిమాండ్ వినిపిస్తున్నా.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా.. సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. మరోవైపు, ఇప్పటికే స్కూళ్లు మూసివేసిన రాష్ట్రాలకు కూడా మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!