థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొంటాం… కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయములో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్. జిల్లాలో కరోన థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లు చేశాం అన్నారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి.
కష్టకాలములో అవసరమైతే కావలసిన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు స్థానిక అధికారులకు కల్పించాము. వాక్సినేషన్లో రాష్ట్రములోనే జిల్లా ఐదవ స్థానములో ఉంది. జిల్లాలో నాలుగు వందల డెబ్బైతొమ్మిది వైద్య బృందాలు లక్షా యాభై వేల ఇండ్లు ఫీవర్ సర్వే చేస్తున్నాయన్నారు.
Also Read
రాష్ట్రములో జిల్లా హెల్త్ ప్రొఫైల్ స్కీంకు పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైంది. ఫిబ్రవరిలో మొదటి వారములో పనులు ప్రారంభవుతాయన్నారు. జిల్లాలోని పదమూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మొదటి విడత దళిత బందు లబ్దిదారుల ఎంపిక ప్రారంభిస్తాం.
జిల్లాలో మనఊరు మనబడిలో భాగముగా ఐదువందల పది పాటశాలలను మూడు సంవత్సరాలలో ఆధునీకరిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటినుండి కేంద్రం ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్టులలో ఇక్కడి నేతన్నలకు కేంద్రం పట్టించుకున్నది ఏమీలేదు. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రం ఎనిమిది వందల్ తొంభై ఏడు కోట్ల తొంబ్బై రెండు లక్షలు మంజూరు చేయించాలని బండి సంజయ్ కు డిమాండ్.
పోచంపల్లి కేంద్రంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఒయా హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసే బాధ్యత బండి సంజయ్ దే అన్నారు. లూమ్ అప్ గ్రడేషన్ పథకానికి కేంద్రం సహాయం చేయాలి. టెక్స్ టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను కేంద్రం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో కొత్తగా పదకొండు చేనేత సమూహాలను బండి సంజయ్ మంజూరు చేయాలి. మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను యంపి బండి సంజయ్ మంజూరు చేయించాలి. మంజూరు చేయకపోతే రాష్ట్రములోని నేతన్నలను ఏకం చేసి పోరాటం చేస్తాం అన్నారు కేటీఆర్.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!