ఇండియాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉధృతం అవుతున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 4,12,262 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,77,410కి చేరింది. ఇందులో 1,72,80,844 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 3,980 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన…
కరోనా వాక్సినేషన్ పై ప్రధాని మోడీకి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానికి వాక్సిన్ డోసుల ను త్వరగా కేటాయించాలని లేఖ రాయనున్నారు సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళు పైబడిన వారికి వాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుండి రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే రేపటి నుండి…
కరోనా కేసులు దేశంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. బి.1.617, బి.1.618 తో పాటుగా ఎన్ 440 కె రకం వేరియంట్ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిపై చేసిన పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. మొదటి దశలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించిన కరోనా, రెండో దశలో ఒకటి నుంచి ఏకంగా ముగ్గురికి వ్యాపిస్తున్నట్టు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్…
ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. వారం తర్వాత ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఆటగాళ్లకు కరోనా సోకుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలుగురు ప్లేయర్లు, కోచ్ లు కరోనా బారిన పడ్డారు. అటు ఇవాళ సన్ రిజర్స్ ఆటగాడు వృద్ధమన్ సాహాకు కూడా కరోనా సోకింది. ఇది ఇలా ఉండగా ఇద్దరు కోలకతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో నిన్న జరగాల్సిన కేకేఆర్,…
దేశంలో మహమ్మారి కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసులను కంట్రోల్ చేయకుంటే ఆరోగ్యవ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉన్నది. దీంతో రాష్ట్రాల్లోని కోర్టులు కరోనా మహమ్మారి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా, బీహార్ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీహార్ లో రోజువారీ కేసులు పెరుగుతుండటంతో పాటుగా, హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ…
ప్రపంచంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రపంచ దేశాలు మహమ్మారి భయం నుంచి ఇంకా కోలుకోలేదు. గల్ఫ్ దేశాల్లో కరోనా మహమ్మారి మళ్ళీ క్రమంగా విజృంభిస్తోంది. దీంతో అక్కడ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. గల్ఫ్ ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. ఇండియా విమానాలపై రెండు వారాలు బ్యాన్ విధించింది. ఇక దేశీయ పౌరులపై కూడా ఆ దేశంలో కఠిన ఆంక్షలు విధించింది. దేశీయంగా టీకాలు వేయించుకొని పౌరులపై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. టీకాలు వేసుకోని…
ఇండియాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. తాజాగా ఇండియాలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కి చేరింది. ఇందులో 1,66,13,292 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,47,133 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో రెండు కోట్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఏపీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా మరికొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతున్నారు. ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుడితో పాటుగా డ్రైవర్ కు మాత్రమే ఎయిర్ పోర్ట్ ఆవరణలోకి అనుమతి ఉంటుంది. వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రాధాన ద్వారం వద్దే నిలిపివేయనున్నారు. …
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉండగా.. సెకవండ్ వేవ్‌లో అత్యధికంగా ఇవాళ ఏకంగా 19 వేల పైచీలుకు కేసులు నమోదు అయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం.. గతో 24 గంటల్లో 19,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 61 మంది కోవిడ్ బారినపడి మృతిచెందారు.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,21,102కు చేరుకోగా.. మృతుల…
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు.. ఇప్పటికే రెండో విడతలగా లాక్‌డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.. దీంతో.. మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కాగా, ఢిల్లీలో తాజాగా 27,000 కొత్త కేసులు నమోదు కాగా.. 375 మంది మృతిచెందారు.. ఇలా వరుసగా 13వ రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. మరోవారం…